బ్రేకింగ్ అండ్ బ్లాస్టింగ్.. జ‌గ‌న్ మాస్ట‌ర్ మైండ్.. వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి..?

Thursday, November 8th, 2018, 10:09:20 AM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. దీంతో అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నారు. ఇక తాజాగా జ‌గ‌న్ పై జ‌రిగిన‌ దాడి ఏపీ రాజ‌కీయాల్లో ర‌చ్చ లేపిన సంగ‌తి తెతిసిందే. దీంతో ప్ర‌స్తుతం జ‌గ‌న్ త‌న పాద‌యాత్రకు బ్రేక్ ఇచ్చి.. వైద్యుల సూచ‌న మేర‌కు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో త‌న‌కు దొరికిన ఈ ఖాళీ సమయంలో జగన్, త‌న‌ పార్టీ బలోపేతం పైనే దృష్టి సారించాడని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో పార్టీలోని ముఖ్య నేతలను పలిపించుకుని సుదీర్ఘంగా భేటీ అయ్యాడని సమాచారం.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. వైసీపీకి ప‌ట్టున్న జిల్లాల్లో ప్ర‌కాశం జిల్లా ఒక‌టి. ఆ జిల్లాలో వైసీపీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు జ‌గ‌న్ కొంద‌రు కీల‌క నేత‌ల‌ను జ‌గ‌న్ వైసీపీలోకి ఆహ్వానిస్తున్నాడ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ హ‌యాంలో ప్ర‌కాశం, నెల్లూరు, గూడురు జిల్లాల్లో చక్రం తిప్పిన బాపట్ల మాజీ ఎంపీ ప‌న‌బాక ల‌క్ష్మీ ఫ్యామిలీకి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. 1996, 1998, 2004లో నెల్లూరు నుంచి గెలుపొందిన ప‌న‌బాక‌ ల‌క్ష్మీ, 2009 బాప‌ట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఇక‌ కేంద్రంలో జౌళి శాఖ స‌హాయ మంత్రిగా కూడా ప‌న‌బాక‌ ప‌నిచేశారు. ఇక‌, అదే ఎన్నిక‌ల్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రోత్సాహంతో గూడురు నుంచి ప‌న‌బాక కృష్ణ‌య్య అసెంబ్లీకి పోటీ చేశారు.

అయితే ప్ర‌స్తుతం ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి లేక‌పోగా తాజాగా టీడీపీ-కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు ఉండ‌డంతో ప‌న‌బాక దంప‌తులు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు పై కార్యాచ‌ర‌ణ చేసుకుంటున్నారు. ఈ నేప‌ధ్యంలో వైసీపీ నుండి పిలుపు రావ‌డంతో ప‌న‌బాక దంప‌తులు పాజిటీవ్‌గా రెస్పాండ్ అయ్యార‌ని తెలుస్తోంది. అంతే కాకుండా జ‌గ‌న్ పాద‌య‌త్ర కంప్లీట్ అయ్యేలోకి ప‌న‌బాక దంప‌తులు వైసీపీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని స‌మాచారం. బాప‌ట్ల‌లో స‌రైన అభ్య‌ర్ధి కోసం చూస్తున్న జ‌గ‌న్.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌న‌బాక ల‌క్ష్మీని బ‌రిలోకి దించ‌నున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అలాగే ప‌న‌బాక కృష్ణయ్య‌కు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ సీటు ఇవ్వ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇక ప‌న‌బాక దంప‌తులు వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే ప్ర‌కాశం జిల్లాలో వైసీపీకి తిరుగే ఉండ‌ద‌ని వైసీపీ శ్రేణుల్లో చ‌ర్చించుకుంటున్నారు.