కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ రీ ఎంట్రీ!.. జనసేనతో?

Monday, March 5th, 2018, 01:00:07 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఒక్కసారిగా రాష్ట్రంలో అనుకోని మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీఎం పదవిలో వెంటనే మార్పులు జరిగాయి. సీనియర్ నాయకుడు రోశయ్య అనంతరం అసెంబ్లీ స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో కిరణ్ కుమార్ పై కూడా ఒత్తిడి పెరిగింది. 2014 ఎలక్షన్స్ లో ఆయన జై సమైక్యాంధ్ర అనే పార్టీని కూడా స్థాపించారు.

కానీ ఆ పార్టీ పేరు ఎలక్షన్స్ టైమ్ లో తప్పితే మళ్లీ వినిపించలేదు. కిరణ్ కుమార్ రెడ్డికి కూడా మళ్లీ కనిపించలేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వస్తోంది. కాంగ్రెస్ నేతలతో కిరణ్ కుమార్ ఇంకా టచ్ లోనే ఉంటున్నారట. అయితే ఆయన మాత్రం కాంగ్రెస్ థాయ్ చేతులు కలిపేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎక్కువగా జనసేన పార్టీపై మొగ్గు చూపుతున్నారని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని తప్పకుండా కిరణ్ కుమార్ రీ ఎంట్రీకి సన్నాహకాలు చేస్తున్నారని సమాచారం.