మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకహోదా,జగన్ లపై సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, September 19th, 2018, 01:57:55 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలోను మరియు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షములో ఉన్న జగన్ మోహన్ రెడ్డి మీదను కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నిమిత్తం ఈ రోజు కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల భారీ బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే దాదాపు లక్షా ముప్పైవేల మందికి ఉద్యోగావకాశలు కల్పిచాం అని పేర్కొన్నారు.

ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన బీజేపీ తో జోడి కట్టిన తెలుగుదేశం పార్టీని ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు.ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ పార్టీ యొక్క పనితీరుని కూడా ఎండగట్టారు.ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అంటే అది ఒక్క కేవలం రాహుల్ గాంధీ గారి వల్లనే అవుతుందని తెలిపారు. ఇదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి వై ఎస్ జగన్ మీద కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఆంద్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కోసం వైసీపీ పార్టీ వారు కనీసం ఒక్క సక్రమమైన ఉద్యమం కూడా చెయ్యలేదని, వారు అస్సలు ప్రజా సమస్యలపైన మాట్లాడరని వాళ్ళని కాల్చేయ్యండి,వీళ్ళని ఉరి తియ్యండి అని మాట్లాడుతారని ఒక నాయకుడు ఆ విధంగానేనా మాట్లాడేది అని మండిపడ్డారు.