విజ‌య‌న‌గ‌రం జిల్లా – బొబ్బ‌లి గ‌డ్డ సాక్షిగా.. వైసీపీలో చేర‌నున్న మాజీ మంత్రి సీఆర్..!

Saturday, November 10th, 2018, 03:34:40 PM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ జోరు పెంచింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాల‌ని వైసీపీ తీవ్రంగా కృషి చేస్తుంది. జ‌గ‌న్ ఎప్పుడైతే పాద‌యాత్ర స్టార్ట్ ఏశారో అప్ప‌టి నుండి వైసీపీ విప‌రీతంగా పుంజుకుంది. ఈ క్ర‌మంలో తాజాగా తెర‌పైకి వ‌స్తున్న స‌ర్వేలు కూడా వైసీపీకి పాజిటీవ్‌గా వ‌స్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో అనేక‌మంది నేత‌లు వైసీపీ గూటికి చేరేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక తాజా మ్యాట‌ర్ ఏంటంటే సీన‌య‌ర్ నేత‌, మాజీ మంత్రి వైసీపీలో చేర‌నున్నార‌ని స‌మాచారం.

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య ఇటీవ‌ల్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్-టీడీపీ పొత్తుతో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన రామ చంద్ర‌య్య ఆ పొత్తును తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. అయితే చిరంజీవితో ఉన్న అనుబంధం, సామాజిక కార‌ణాల నేప‌ధ్యంలో రామ‌చంద్ర‌య్య జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే తాజాగా ఆ సన్నిహితులతో చ‌ర్చలు జ‌రిపి వైసీపీలోకి వెళ్ళేందుకు నిశ్చ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా, బొబ్బిలిలో న‌వంబ‌ర్ 13న వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌నున్నార‌ని స‌మాచారం. దీంతో మాజీ మంత్రి సీఆర్ ఎంట్రీతో వైసీపీ బ‌లం మ‌రింత పెరుగుతుంద‌ని వైసీపీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments