మాజీ మంత్రి కన్నా కు అస్వస్థత!

Wednesday, April 25th, 2018, 12:21:30 PM IST

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంచి పేరున్న లీడర్ కన్నా లక్ష్మి నారాయణ, కొన్నాళ్ల క్రితం బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వున్నపుడు ఆయనకు వెన్ను దన్నుగా వున్న పలువురు నాయకుల్లో కన్నా కూడా ఒకరు. ఇంతకుముందు పలుమార్లు గుంటూరు నుండి ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. అయితే వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ పార్టీలో చీలికలు, అంతర్గత విబేధాల కారణంగా పార్టీ నుండి బయటకి వచ్చి కొన్నాళ్ల తర్వాత బీజేపీలో చేరారు.

అయితే అప్పటినుండి ఆయనకు ఆ పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదని, సరైన గుర్తింపు కూడా లేదని భావించిన ఆయన మంగళవారం బిజెపికి రాజీనామా చేశారు. కాగా నేటి తెల్లవారుఝామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే హైబిపి కారణంగా ఆయన ఇబ్బందిపడ్డారని, అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలుకడగా ఉందని, కొన్నాళ్లపాటు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు అన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెపుతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అంటున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments