నేడు వైసిపిలో చేరనున్న మాజీ మంత్రి తనయుడు!

Thursday, May 10th, 2018, 08:08:07 AM IST

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులు తమ అనుకూల పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే గతకొద్దిరోజులుగా రెండు ప్రధానపార్టీల్లోకి పలువురు నేతలు చేరుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా నేడు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు పారిశ్రామికవేత్త వసంత కృష్ణ ప్రసాద్ నేడు వైసిపి తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ మేరకు ఆయన అనుచరులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత నందిగామ మండలం ఐతవరంలోని ఆయన స్వగృహం నుండి ర్యాలీగా బయలుదేరి వెళ్లి వైసిపి అధినేత జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా కైకలూరులో ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఆయనతోపాటు జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు, వైసిపి నాయకులు ఆయన వెంట తరలి వెళ్లనున్నారు…….

Comments