ఎంత మంది కెసిఆర్ కేటీఆర్లు వచ్చినా కొడంగల్లో గెలిచేది నేనే..!

Tuesday, September 25th, 2018, 01:25:24 AM IST

తెలంగాణా ముందస్తు ఎన్నికల నేపధ్యంలో రాజకీయ పార్టీల యొక్క ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి.ఏ పార్టీకి సంబందించిన కార్యకర్తలు వారి పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.ముఖ్యంగా తెరాస మరియు కాంగ్రస్ పార్టీల నాయకులు ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు,తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి కొడంగల్ అభ్యర్థిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ నియమించిన సంగతి తెలిసినదే.

ఆ తర్వాత మొట్ట మొదటి సారిగా రేవంత్ రెడ్డి కొండగల్ కు చేరుకునే సరికి భారీగా అభిమానులు ఆహ్వానించారు,ఆ తర్వాత తమ పార్టీ అభిమానులతో మాట్లాడారు.కొడంగల్ అడ్డా కాంగ్రెస్ అడ్డా అని ఇక్కడ ఎంత మంది కెసిఆర్ లు కేటీఆర్ లు కలిసి వచ్చినా సరే గెలిచేది నేనే అని గట్టిగా చెప్పారు.ఎంత మంది ఎన్ని కుట్రలు చేసినా,పట్నం బ్రదర్స్ ను బొందపెడతా అని సవాల్ విసిరారు.బి ఆర్ అంబెడ్కర్ సాక్షిగా కొడంగల్ లో గెలిచేది నేనే అని తెలిపారు.