పొలిటిక‌ల్ బ్రేకింగ్.. జనసేనలోకి మాజీ ఎంపీ..?

Friday, October 19th, 2018, 12:50:48 PM IST

ఏపీ రాజ‌కీయాలు గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల నుండి వైసీపీ- టీడీపీల మ‌ధ్య నువ్వా-నేనా అన్న‌ట్టు సాగింది. అయితే ఇప్పుడు తాజాగా జ‌నసేన కూడా వ‌చ్చి చేర‌డంతో అక్క‌డి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌ర స్థాయికి చేరుకున్నాయి. గ‌త కొంత కాలంగా టీడీపీ,వైసీపీ పార్టీల్లో వ‌ల‌స‌ల ప‌రంప‌ర కొన‌సాగ‌గా.. ఇప్పుడు తాజాగా జ‌న‌సేన లోకి నేత‌లు క్యూలు క‌డుతున్నారు. ఇటీవ‌ల జ‌న‌సేన‌లోకి ఉమ్మ‌డి ఏపీ నాదెండ్ల మ‌నోహ‌ర్ చేరిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే క్ర‌మంలో జ‌న‌సేన బాట ప‌డుతున్నారు నేత‌లు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా జ‌న‌సేన‌లోకి మాజీ ఎంపీ తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ జ‌న‌సేన తీర్ధం పుచ్చుకుంటారనే టాక్ ఏపీ రాజ‌కీయాల్లో బ‌లంగా వినిపిస్తోంది. 20014, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున గెలిచిన ఈ ప్ర‌ముఖ నేత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రేదేశ్ విభ‌జ‌న అనంత‌రం ఆ పార్టీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో మ‌రోపార్టీ నుండి పోటీ చేసి ఓట‌మి పాలు అయ్యారు. అయితే స‌బ్జెట్ ప‌రంగా మంచి పేరు ఉంది. ఇక సౌమ్యుడిగా పేరొందిన ఈ మాజీ ఎంపీ నోటి నుండి అన‌వ‌స‌ర‌మైన మాట‌లు బ‌య‌ట‌కు రావు. దీంతో ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సంప్ర‌దింపులు జరిపిన‌ట్టు స‌మాచారం. ఈ నేప‌ధ్యంలో ప‌వన్ ఆయ‌న చేరిక పై గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని.. త్వ‌ర‌లోనే ఈ మాజీ ఎంపీ జ‌న‌సేన తీర్ధం పుచ్చుకోవ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.