అదరగొట్టే ఫీచర్లతో శాంసంగ్ ఎస్9, ఎస్9 ప్లస్!

Monday, February 26th, 2018, 03:20:18 PM IST

ప్రస్తుతం మొబైల్ రంగం లో ఎప్పటికప్పుడు వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాయి మొబైల్ కంపెనీలు, అందుకు ప్రధాన కారణం మార్కెట్ లో మొబైల్ కంపెనీల మధ్య నెలకొని వున్న తీవ్రపోటీ. ఆ పోటీ కారణంగా ప్రతి కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ను మార్కెట్ లో ప్రవేశపెడుతో వినియోగదారులను ఆకర్షించేందుకు తగు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం మొబైల్‌ రంగ దిగ్గజం శాంసంగ్‌ తన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ గెలాక్సీ ఎస్‌9, ఎస్‌9 ప్లస్ మొబైళ్లను విడుదల చేసింది. అయితే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ 2018 కార్యక్రమానికి ముందు దీనిని విడుదల చేయడం విశేషం. గెలాక్సీ ఎస్‌8ను మరింత మెరుగుపర్చి ఎస్‌9 మోడల్స్ కు తుదిరూపునిచ్చారని అర్థమవుతోంది. మెరుగైన కెమేరా, మెరుగుపరిచిన రామ్ పెర్ఫార్మన్స్, స్మార్‌ థింగ్స్‌ యాప్‌, మెరుగుపర్చిన బిక్స్‌బై, నాక్స్‌ 3.1, డిఫెన్స్‌ గ్రేడ్‌ సెక్యూరిటీ వంటి అత్యాధునిక ఫీచర్లు దీనిలో ఉన్నాయి. భారత్‌లోని కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లో రూ. 2,000 ముందుగా చెల్లించి ప్రీబుకింగ్‌ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. ఈ ఫోన్లు మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి. మిడ్‌నైట్‌ బ్లాక్‌, కోరల్‌ బ్లూ, టైటానియం గ్రే, లిలాక్‌ పర్పుల్‌ రంగుల్లో విడుదల చేయడం జరిగింది. అయితే ఈ మొదల్లో ప్రత్యేకత ఏ ఆర్ టెక్నలజి కలిగివుండడమే. ఈ టెక్నలజి ద్వారా ఫోన్ కి ఎదురుగా ఏదైనా వస్తువుని ఉంచి దానిని ఫోన్ తో స్కాన్ చేసినట్లయితే ఆ వస్తువుని యిట్టె గుర్తించగలగడం. కాగా యాపిల్ కు పోటీగా అందులో వున్నా ఏనిమోజి కి పోటీగా ఎమోజి ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 2డి లో వున్నా ఇమేజ్ లను 3డి ఇమేజ్ లుగా మార్చవచ్చు. కాగా ఈ రెండు మోడళ్ళు మర్చి లో అందుబాటులోకి రానున్నాయి.

 ఎస్ 9 ఫీచర్లు :
5.8 అంగుళాల స్క్రీన్
8.5 ఎం ఎం థిక్ నెస్
ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో పాటు ఇంటిలిజెంట్‌ స్కానర్‌
ఏకేపీ స్టీరియో స్పీకర్ విత్ డాల్బీ సరౌండ్ సౌండ్
ఆక్టాకొర్ 10 ఎన్ ఎం ప్రాసెసర్
4 జిబి రామ్
64 జిబి ఇంటర్నల్ మెమరీ / 256 జిబి ఇంటర్నల్ మెమరీ
ఎక్స్ పాండబుల్ 400 జిబి మెమరీ
సింగిల్‌ సూపర్‌ డ్యూయెల్‌ ఆపాచర్‌ 12మెగాపిక్సల్ కెమేరా
3000 ఎమ్ ఏహెచ్ బ్యాటరీ

ఎస్ 9 ప్లస్ ఫీచర్లు:
6.2 అంగుళాల స్క్రీన్
8.5 ఎం ఎం థిక్ నెస్
ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో పాటు ఇంటిలిజెంట్‌ స్కానర్‌
ఏకేపీ స్టీరియో స్పీకర్ విత్ డాల్బీ సరౌండ్ సౌండ్
ఆక్టాకొర్ 10 ఎన్ ఎం ప్రాసెసర్
6 జిబి రామ్
64 జిబి ఇంటర్నల్ మెమరీ / 256 జిబి ఇంటర్నల్ మెమరీ
ఎక్స్ పాండబుల్ 400 జిబి మెమరీ
డ్యూయో సూపర్‌ డ్యూయెల్‌ ఆపాచర్‌ 12మెగాపిక్సల్ కెమేరా
3500 ఎమ్ ఏహెచ్ బ్యాటరీ