ఐపీఎల్ లో విలియంసన్ అద్భుత రికార్డు!

Tuesday, May 8th, 2018, 12:39:14 AM IST

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్ మంచి రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. కాగా నేడు జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ ఛాలెంజెర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక అరుదైన రికార్డు నమోదు అయింది. ఈ మ్యాచ్ లో 39 బంతుల్లో 56 పరుగులు చేసిన సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ ఇప్పటివరకు ఈ ఐపీఎల్ లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల లిస్ట్ లో ప్రధమ స్థానం లో నిలిచాడు.

ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన విలియంసన్ మొత్తం 5 అర్ధ సెంచరీలు సాధించాడు. కాగా అతని తర్వాతి స్థానాల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యదవ్ లు సంయుక్తంగా చెరు నాలుగు అర్ధ సెంచరీలు సాధించి తరువాతి స్థానాల్లో నిలిచారు. సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్ కేసు లో నిషేధం ఎదుర్కొని జట్టునుండి బహిష్కరించబడడంతో ఆ జట్టు సారధిగా కేన్ విలియంసన్ కు ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే……

Comments