జగన్ పై దాడి ఇలా జరిగింది కళ్ళకి కట్టినట్టు చెప్పిన ప్రత్యక్ష సాక్షి..!

Thursday, October 25th, 2018, 02:43:09 PM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్ పై ఈ విశాఖపట్నం జిల్లా ఎయిర్ పోర్ట్ లో కత్తితో దాడి జరగడం ఎంత సంచలలానికి దారి తీసిందో అందరికి తెలుసు.రేపు కోర్టుకి హాజరు కావడానికి ప్రస్తుతం విజయనగరం జిల్లాలో జరుగుతున్నటువంటి తన పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్ రావడానికి గాను విశాఖ జిల్లాలో ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి అసలు ఇలా జరిగిందని అక్కడే ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి కళ్ళకి కట్టినట్టు వివరించారు.

అక్కడ వై ఎస్ జగన్ టిఫిన్ చేసిన తర్వాత అక్కడి లాంజ్ లో విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడ ఆ లోపల కాంటీన్ లో వెయిటర్ గా పనిచేసే శ్రీనివాస రావు అనే అబ్బాయి సెల్ఫీ తీస్కుంటా అని జగన్ దగ్గరకి వచ్చి చిన్న చాకుతో దాడి చేశాడని అక్కడే ఉన్నటువంటి వంశీ రెడ్డి తెలిపారు.అయితే అదే సందర్భంలో మరో షాకింగ్ విషయాన్ని కూడా ఆయన బయట పెట్టారు..జగన్ పై శ్రీనివాస్ ఎప్పటి నుంచో దాడికి ప్రయత్నిస్తున్నానని ఈ రోజు కుదరడంతో దాడికి పాల్పడ్డానని ఆ అబ్బాయే తెలిపాడని వంశీ తెలిపారు.అయితే జగన్ కి ఆ సమయంలో రక్షణ సిబ్బంది కూడా చాలా తక్కువ మంది ఉన్నారని,అదే అదునుగా చూసుకొని అతను దాడికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు..