మూవీ రివ్యూ : ఎఫ్2

Saturday, January 12th, 2019, 02:57:18 PM IST

టాలీవుడ్ లో మరో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి.తన మొదటి సినిమా నుంచి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తనదైన మార్క్ కామెడీ స్క్రిప్ట్ తో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు.ఇప్పుడు కూడా  అలాగే ఫ్యామిలీ హీరో “విక్టరీ” వెంకటేష్ మరియు మెగా హీరో వరుణ్ తేజ్ ల కలయికలో క్రేజీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన చిత్రం “ఎఫ్2”.అనిల్ మరోసారి తన మార్క్ కామెడీతో నవ్వించడానికి సంక్రాంతి అల్లుళ్లుగా ఈ పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మరి ఈ సంక్రాంతి అల్లుళ్ళు ఎంత వరకు నవ్వించారో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే వెంకీ – తమన్నా,వరుణ్ – మెహ్రీన్ లు భార్య భర్తలు,వీరికున్న ఈగో ప్రాబ్లెమ్స్ వల్ల కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి,అసలు వారికొచ్చిన ప్రధాన సమస్య ఏంటి?ఆ సమస్యను చివరికి ఎలా పరిష్కరించుకున్నారు?ఈ క్రమంలో వెంకీ,వరుణ్ ల మధ్య ఎలాంటి ఫన్ జెనరేట్ అయ్యింది అన్నది తెలుసుకోవాలి అంటే వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

గత కొంత కాలం నుంచి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తనకి తగ్గ పాత్రలు ఎంచుకుంటూ మల్టీ స్టారర్ చిత్రాలలో బాగానే కనిపిస్తున్నారు.అలాగే మరో పక్క వరుణ్ కూడా భిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నారు.అదే విధంగా తనదైన మార్క్ కామెడీ చిత్రాలతో వరుస విజయాలతో అనిల్ రావిపూడి కూడా దూసుకెళ్ళిపోతున్నారు.ఇప్పుడు ఈ ముగ్గరు కాంబినేషన్లో వచ్చిన ఎఫ్2 చిత్రాన్ని విశ్లేషించినట్టైతే మొదటి సగం అంతా అనీల్ మరోసారి తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తారు.అక్క చెల్లెళ్లుగా తమన్నా మరియు మెహ్రీన్ లు బాగానే ఆకట్టుకుంటారు.

అలాగే చాలా కాలం నుంచి వెంకటేష్ నుంచి అప్పట్లో ఉండే కామెడీ ఎవరైతే కోరుకుంటున్నారో ఈ సినిమాతో వారికి మంచి సమాధానం దొరికిందని చెప్పొచ్చు.అలాగే వరుణ్ కూడా తన కామెడీతో బాగానే అలరిస్తారు.వారి భార్యల వల్ల పడే ఇబ్బందుల వల్ల ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యే భర్తలుగా వెంకీ మరియు వరుణ్ మంచి ఫన్ జెనరేట్ చేస్తారు,కానీ ఇక్కడ దర్శకుని విషయానికి వచ్చినట్టయితే,ఫస్టాఫ్ ముగిసే వరకు కథ ఏమిటి అన్నది ప్రేక్షకునికి ఒక క్లారిటీ అంటూ రాదు.సినిమా చూసే కొద్దీ కామెడీ బాగానే పండుతుంది కానీ అసలైన కథనం ఏమిటి అన్నదానిపై దర్శకుడు దృష్టి పెడితే బాగున్ను.

ఇక మిగతా నటులు రాజేంద్ర ప్రసాద్,ప్రకాష్ రాజ్,వెన్నెల కిషోర్ తదితరులు వారి పాత్రల పరిధి మేరకు బాగానే అలరిస్తారు.అలాగే అనిల్ యొక్క అన్ని సినిమాల్లో ఉండే కామెడీ మార్క్ డైలాగ్ “అంతేగా అంతేగా” మరోసారి పేలింది.అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని హాస్య సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి.ఇంకా సెకండాఫ్ కన్నా ఫస్టాపే బాగుందని చెప్పాలి.సెకండాఫ్ స్టార్టింగ్ కాసేపు బోరింగ్ గా అనిపించినా,క్లైమాక్స్ మాత్రం దర్శకుడు బాగానే ఇచ్చారు.ఇక సంగీతానికి వచినట్టైతే దేవిశ్రీ అందించిన 6 పాటలలో 4 పాటలు బాగున్నాయి.ఎప్పుడు కామెడీని నమ్ముకున్న అనిల్ ఈ చిత్రంతో కూడా సక్సెస్ అయినా కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం,పేలవమైన సెకండాఫ్ వీటిపై కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

వెంకీ కామెడీ టైమింగ్.
వెంకీ,వరుణ్ తేజ్ ఎపిసోడ్స్.
ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని ఫన్నీ సన్నివేశాలు.
క్లైమాక్స్.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్
రొటీన్ కథ
సంగీతం

తీర్పు :

మొత్తానికి సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుళ్ళు బాగానే నవ్వించారని చెప్పాలి.కానీ వీరి పాత్రలు సృష్టించిన దర్శకుడు ఫస్టాఫ్ తో పాటు సెకండాఫ్ పై కూడా ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగున్ను.ఈ సంక్రాంతికి కుటుంబంతో కలిసి ఒకసారి చూడొచ్చు.

Rating : 3/5

REVIEW OVERVIEW
F2 Movie Review in Telugu