టాలీవుడ్ బ్రేకింగ్.. విడుద‌ల‌కు ముందే.. ఎఫ్-2కు ఊహించ‌ని షాక్..?

Friday, January 11th, 2019, 05:25:30 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సంక్రాంతి సీజ‌న్‌కు ఇప్ప‌టికే మూడు భారీ చిత్రాలు విడుద‌ల అయ్యాయి. ఎన్టీఆర్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిన ఎన్టీఆర్ క‌థానాయ‌కు చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నా బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్ష‌న్లు దారుణంగా ఉన్నాయి. ఇక ఆ త‌ర్వాత ఒక్క‌రోజు గ్యాప్‌లో వ‌చ్చిన సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ చిత్రం పేట ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ రోజు విడుద‌ల అయిన విన‌య విధేయ రామ చిత్రం కూడా డిజాస్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ సంక్రాంతి సీజ‌న్‌కి విడుద‌ల కానున్న ఎఫ్‌-2 చిత్రం పై సినీ వ‌ర్గాల్లో ఆశ‌క్తి పెరిగింది.

ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో వెంక‌టేష్, వ‌రుణ్‌తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా, మినిమం గ్యారెంటీ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్, ట్రైల‌ర్లు ఆక‌ట్టుకోవ‌డంతో, అంద‌రి చూపు ఇప్పుడు ఎఫ్‌-2 పై ప‌డింది. అయితే ఈ సినిమా పై ప్రేక్ష‌కులు అంత ఇంట్ర‌స్ట్ చూప‌డం లేద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్ప‌టికీ అడ్వాన్స్ బుకింగ్‌లు చాలా పూర్‌గా ఉన్నాయ‌ని, కొన్ని థియేట‌ర్ల‌లో అయితే, సగం టిక్కెట్లు కూడా బుక్ కాలేద‌ని, బుకింగ్స్ ప్రారంభించి న‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు, హైద‌రాబాద్‌లో క‌నీసం 50 శాతం కూడా టిక్కెట్లు అమ్ముడు పోలేద‌ని స‌మాచారం. దీంతో ఈ చిత్రానికి కూడా పూర్ ఓపెనింగ్స్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.