తెలుగులో మల్టి స్టార్ చిత్రాల జోరు కొనసాగుతుంది. తాజాగా విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఒక చిత్రం రూపు దిద్దుకుంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. వీరి కలయికలో వస్తున్నా మల్టీస్టారర్ చిత్రం ‘f2’. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అనేది ఉపశీర్షిక. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను 12న విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం పూర్తీ స్థాయిలో కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కించారు.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ – ‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా బ్యానర్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘f2’. మంచి మెసేజ్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులు కలిపి కామెడీ కి ప్రాధాన్యం ఉన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు అనిల్ రావిపూడి తో చేయడం ఆనందంగా ఉంది. అనిల్ రావిపూడి మూడు వరుస హిట్స్ తర్వాత తెరకెక్కించిన చిత్రం కావడం తో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒక పాట మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. డిసెంబర్ 12న టీజర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే పాటలను కూడా త్వరలోనే విడుదల చేస్తాం. సంక్రాంతి కానుకగా సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తున్నాము అని అన్నారు.