అప్ డేట్స్ – డల్ గా ఉన్నటువంటి F2 టికెట్ బుకింగ్స్

Thursday, January 10th, 2019, 06:15:20 PM IST

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ఇప్పటికే రెండు సినిమాలు విడుదలయ్యి ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఏవ్ కాకుండా ఇంకా కొన్ని సినిమాలు కూడా విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి F2… ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ఉపశీర్షిక తో విడుదలకి సిద్ధంగా ఉంది ఈ చిత్రం. ఈ చిత్రం లో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. వీరికి జంటగా తమన్నా మరియు మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు పాటలు కొంత వారికి మెప్పించినప్పటికీ కూడా ఎందుకో అంతలా ఈ సినిమా మీద క్రెజ్ ఉన్నట్లు కనిపించడం లేదు.

ఎందుకంటే థియేటర్లలో టిక్కెట్ల కోసం సినిమా రిలీజ్ కి కొన్ని రోజులముందే బుకింగ్ తెరిచినప్పటికిని కూడా అంతగా ఆశించిన రీతిలో టిక్కెట్లు అమ్ముడవ్వడం లేదు. మూసాపేట్ లోని లక్ష్మీకళ థియేటర్లో బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ కూడా కనీసం 20% వరకు కూడా టిక్కెట్లు సేల్ అవలేదు. ఇందుకు కారణం ముందే రిలీజ్ అయిన పెద్ద సినిమాల ప్రభావమో ఏమో తెలీదుగానీ, ఇప్పటికైతే లక్ష్మీకళ థియేటర్ ఒక్కటే కాకా దాదాపు F 2సినిమాకోసం కేటాయించిన థియేటర్ల అన్నింటి పరిస్థితి ఇలాగె కనిపిస్తుంది.