లోపాలున్నాయని తెలిసి కూడా ఫేస్ బుక్ మోసం చేసింది…

Friday, March 30th, 2018, 03:21:28 PM IST

హత కొద్దిరోజులుగా ఫేస్ బుక్ వల్ల జరుగుతున్న కుంభకోణాల గురించి వింటూనే వస్తున్నాం. కానీ తాజాగా వెల్లడైన విషయమేమిటంటే ఎలాగైనా సరే ఫేస్ బుక్ సంస్థ వృద్ధి చెందాలి.. దీనికోసం ఏం చేయడానికైనా రెడీ.. లోపాలు ఉన్నాయని తెలిసినా ఏమీ తెలియనట్లు వ్యవహరించడం.. ఇదీ ఫేస్‌బుక్ గురించి ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ బయటపెట్టిన నిజాలు. 2016లోనే ఆయన ఈ విషయాలను బయటపెట్టారు. ఈ సోషల్ నెట్‌వర్క్ వల్ల ప్రతికూల పరిణామాలు ఉంటాయని తెలిసినా.. ఫేస్‌బుక్ అవేమీ పట్టించుకోలేదని ఆండ్రూ బోస్‌వర్త్ వెల్లడించారు. ఏడాది కాలంగా ఫేస్‌బుక్‌లో ఉన్న లోపాలు వరుసగా మెల్లగా బయటపడుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, హింసాత్మక వీడియోలు, జాతి వివక్ష యాడ్స్.. తాజాగా ప్రైవసీకి సంబంధించిన అంశాలు ఫేస్‌బుక్ కి తలనొప్పిగా మారాయి. వస్తున్నా సమస్యలను పరిష్కరించడం మాని ప్రతిసారీ తప్పులను సరిదిద్దుకుంటామని చెప్పి తప్పించుకుంటున్నది. అయితే ఈ లోపాలన్నీ ఉన్నాయని ఫేస్‌బుక్‌కు ముందే తెలుసని బోస్‌వర్త్ రెండేళ్ల కిందటే వినియోగదారులకు చెప్పాడు. దీర్ఘకాలిక లక్ష్యాలను అందుకోవాలంటే ఇలాంటి రిస్క్‌లను తీసుకోవాల్సిందేనని ఫేస్‌బుక్ బలంగా నమ్ముతుందని ఆయన తెలిపారు. అందుకే సంస్థ వృద్ధి కోసం చేసే ప్రతి పనిని సమర్థించుకోవాల్సి వస్తుందని అన్నారు. తాము చేసే పనులు కొన్ని సమాజంపై చెడు ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. ఫేస్‌బుక్ టూల్స్ సాయంతో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం కూడా ఉంది. దానికి ఎవరినైనా ప్రమాదంలో పడేసే అవకాశం ఉంటుంది అని బోస్‌వర్త్ చెప్పారు. అయితే రెండేళ్ల కిందట రాసిన ఆ లేఖలోని అంశాలతో ఇప్పుడు బోస్‌వర్త్ విభేదిస్తున్నారు. ఇప్పటికైనా ఇవన్నీ తెలుసుకొని సమస్యలను పరిష్కరించాలని లేదంటే ఫేస్ బుక్ వాడే ప్రతీ దేశంలో ఎవరూ అనుకోనివిధమైన పరిణామాలు ఎదురవుతాయని ఆయన అన్నాడు. కానీ ఈ సమస్య పరిష్కరించే ఉపాయం కేవలం సంస్థ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ దగ్గరే ఉన్నాయని ఆయన వీలైనంత తొందరగా స్పందించి సమస్య పరిష్కారం గురించి ఆలోచించాలన్నారు.