తప్పంతా నాదే.. ఒక్క అవకాశం ఇవ్వండి: ఫెస్ బుక్ సీఈఓ

Thursday, April 5th, 2018, 11:46:21 AM IST

గత కొంత కాలంగా ఫెస్ బుక్ ఆదాయం తగ్గుతూ వస్తోంది. అంతే కాకుండా విమర్శలు కూడా పెరుగుతుండడంతో యాజమాన్యం తలలు పట్టుకుంది. ఏకంగా సంస్థ సృష్టి కర్త కాళ్ళ బేరానికి వచ్చాడు. యూజర్ల డేటా మొత్తం ఇతరుల చేతుల్లోకి వెళ్లిందని ప్రపంచ వ్యాప్తగా తెలిసిపోయింది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ముందు జరిగిన ఈ కుంభకోణం భారత్ లో కూడా సంచలనాలు రేపుతోంది. చూస్తుంటే ఫెస్ బుక్ పరిస్థితిపై అనుమానాలు చాలానే వస్తున్నాయి.

అయితే ఇప్పటికే జరిగిన ఘటనపై ఫెస్ బుక్ నివారణ చర్యలు చేపట్టడానికి సిద్ధమైంది. థర్డ్ పార్టీకి సంబంధించి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలోనే ఈ నియమ నిబంధనల లోపాలు చోటు చేసుకున్నట్లు ఫెస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలుపుతూ.. పూర్తి పొరపాటు తనదే అని చెప్పాడు. అలాగే తనని క్షమించాలని కోరుతున్నట్లు మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. తనకు ఇంకొకక్క అవకాశం ఇస్తే తప్పులను సరిదిద్దుకుంటాను పొరపాట్లు జరగడం సహజం. దాన్ని సరిదిద్దుకునేందుకు వీలైనంత త్వరగా ప్రయత్నం చేస్తానని జుకర్ బార్క్ వివరించాడు.