ఫెస్ బుక్ లో శృతి మించితే.. ఇక అంతే!

Wednesday, May 16th, 2018, 10:43:21 AM IST

సోషల్ మీడియా దిగ్గజలలో ఒకటైన ఫెస్ బుక్ పై ఈ మధ్య కాలంలో అధిక ఆరోపణలు వస్తుండడంతో ఇక నుంచి సంస్థలో కొన్ని మార్పులు చేయాలనీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఇక నుంచి మెయిన్ గా ఫెస్ బుక్ ద్వారా వికృత చర్యలు పాల్పడే వారికీ ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యరు. ఫెక్ అకౌంట్లను క్లోజ్ చెయ్యాలని ఫెస్ బుక్ సంస్థ గత కొంత కాలంగా రీసెర్చ్ చేసి 2018 జనవరి నుంచి మార్చ్ 9 వరకు నకిలీ ఎకౌంట్లను డిలీట్ చేసింది. 58.3 కోట్ల ఖాతాలను డిలీట్ చేసినట్లు ఫెస్ బుక్ తెలియజేసింది. అశ్లీల ఫొటోలు ఉగ్రవాద ఫొటోలు హింసాత్మక ఫొటోలు ఎవరైనా పోస్ట్ చేస్తే వెంటనే వారి ఖాతాకు స్వస్తి చెప్పేలా ఫెస్ బుక్ కఠిన నిబంధనలను అమలు చేసింది . అలాగే ద్వేషపూరిత ప్రసంగాలు కామెంట్లు చేసినా కూడా ఎకౌంట్స్ ను క్లోజ్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు లక్షల్లో ఎకౌంట్లను ఫెస్ బుక్ క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పామ్ తో కూడిన 83.7 కోట్ల పోస్ట్ లను కూడా డిలీట్ చేసినట్లు తెలిపారు.

Comments