దొంగ వేలు.. దొంగ ఓటు..!

Tuesday, February 21st, 2017, 12:20:39 PM IST


ఓటు వేసిన ప్రతి వ్యక్తికి వేలిపై సిరా గుర్తు వేస్తారు. చాలా కాలం వరకు అది పోదు.దొంగఓట్లు వేయకుండా తీసుకుంటున్న జాగ్రత్తల్లో అది ఒకటి. కాగా మహారాష్ట్రలో దొంగఓట్లు వేయడానికి సరికొత్త దందాకు తెర తీశారు. మహారాష్ట్రలో మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో నకిలీ ఓట్లు వేశాలా వీలుండే అచ్చం చేతి వేళ్లను పోలివుండే వేళ్ల క్యాప్స్ ని అమ్ముతున్నారు.

ఈ వ్యవహారం బయటపడడంతో ఎన్నికల కమిషన్ కంగుతింది. ఈ వేలిని ధరిస్తే ఓకే వ్యక్తి రెండు ఓట్లు వేసే వీలు ఉంటుంది. ప్లాస్టిక్ వేళ్లు తయారు చేస్తున్నారన్న వార్తలు బయటకు పొక్కడంతో వాటిని కనిపెట్టడం పోలీస్ లకు పెద్ద సవాల్ గా మారింది. వీటివలన నకిలీ ఓట్లు వేయడం పెరుగుతుందేమో అని ఎలక్షన్ కమిషన్ ఆందోళన చెందుతోంది. నాసిక్ పోలీస్ లు నకిలీ వేళ్లను తయారు చేసే ముఠాని పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.