నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను – క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నటుడు

Friday, March 15th, 2019, 10:40:45 PM IST

ఇటీవల వచ్చినటువంటి ఒక వార్త దాదాపుగా సినీ పరిశ్రమతో పాటు అందరిని కలవరానికి గురి చేసింది. ఒక రోడ్డు ప్రమాదంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక నటుడు మరణించాడని, మద్యం సేవించి వాహనం నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రముఖ వెబ్ సైట్ తప్పుడు వార్తలు రాసింది. అతనెవరో కాదు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు సునీల్. ఒక వెబ్ సైట్ ప్రచురించిన కథనం చూసి అభిమానులతో పటు అందరు కూడా ఆందోళనకు గురయ్యారు.

కాగా ఈ వార్తలపై స్పందించిన సునీల్ ట్విటర్‌లో ఈ విధంగా స్పందించారు. ‘అది తప్పుడు వార్త. నేను క్షేమంగా ఉన్నా. దయచేసి ఆ వార్తను నమ్మొద్దు’ అని సునీల్‌ ట్వీట్‌ చేశారు. తమ రేటింగ్ కోసమని ఇలాంటి వదంతులు వ్యాపింపజేయొద్దని, ఆలా చేసిన వ్ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. లేనివి పుట్టించి ఇలా ఘోరమైన వదంతులు రాయడం సరికాదని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని సునీల్ అన్నారు. ఆంతేకాకుండా ఆ వెబ్‌సైట్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వారిని వదిలి పెట్టొద్దని అభిమానులు సునీల్‌ను కోరారు.