నారా అంటే కొత్త అర్థం చెప్పిన మోడీ – సెటైర్ వేసిన ప్రముఖ నటుడు

Sunday, May 26th, 2019, 10:20:38 PM IST

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాలలో వైసీపీ సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. జగన్ విజయంతో ఏపీలో కొత్త శంఖం ప్రారంభం అయిందని జగన్ మద్దతు దారులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు, లోక్ సభ ఎన్నికల్లో 22 సీట్లు గెలవడం ద్వారా వైసీపీ సృష్టించిన ప్రభంజనం జాతీయస్థాయిలో చర్చనీయాంశం అయింది. ఇందుకోసమే టీడీపీ అధినేత చంద్రబాబు మీద కూడా విమర్శలు మరియు వ్యంగ్యాస్త్రాలు ఎక్కువవయ్యాయి. తాజాగా, టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా సెటైర్ వేశారు. మోడీ చేసిన ట్వీట్ చూపిస్తూ చంద్రబాబు పై పరోక్షమైన వాఖ్యలు చేశారు.

‘నారా’ అనే పదంలోని ‘ఎన్’ అంటే నేషనల్, ‘ఏ’ అంటే యాంబిషన్, ‘ఆర్’ అంటే రీజనల్, ‘ఏ’ అంటే ఆస్పిరేషన్స్… ‘జాతీయ స్థాయిలో ఆశయం, ప్రాంతీయ స్థాయిలోనే ఆకాంక్షలు’ అంటూ ఇలా ప్రధాని ఎవర్ని ట్రోల్ చేశాడో మనందరికీ బాగా తెలుసులెండి అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. గత కొంత కాలంగా మంచు కుటుంబానికి మరియు చంద్రబాబు కి సరిగా సఖ్యత లేదని మనకు బాగా తెలుసు. అందువల్లనే విష్ణు చంద్రబాబు పై ఇలా పరోక్షంగా వాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా మంచ్చు కుటుంబం మరియు జగన్ వాళ్ళు సమీప బంధువులు కావడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు…