రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటి మృతి!

Sunday, May 20th, 2018, 11:27:08 AM IST

ఇటీవల రోద్దు ప్రమాదాలపై ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పినప్పటికీ కొందరి నిర్లక్ష్య వైఖరి వల్ల అవి ఏ మాత్రం తగ్గడం లేదు. ట్రాఫిక్, వాహనాలు అధికంగా పెరగడం, ట్రాఫిక్ నియమనిబంధలనలపై సరైన అవగాహనా లేకపోవడమే ప్రమాదాలకు ముఖ్య కారణమని అధికారులు చెపుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన భోజ్పురి నటి మనీష రాయ్ నేడు బల్లియ లోని చిట్టోవ్ని గ్రామం వద్ద రోడ్ ప్రమాదం లో మృతి చెందారు. తన సహనటుడు సంజీవ్ మిశ్ర తో కలిసి ఆమె ఒక షూటింగ్ లో పాల్గొనే నిమిత్తం వెళుతుండగా, వేగంగా వెనుకనుంచి వచ్చి ఒక కారు వారి బైక్ ను ఢీకొట్టడంతో బైక్ నుండి మనీష, సంజీవ్ ఒక్కసారిగా ఎగిరి పడ్డారు.

ఆ ప్రమాదంలో సంజీవ్ కు కొద్దిపాటి గాయాలవగా, మనీషా మాత్రం తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే వెంటనే స్థానికుల సాయంతో ఇద్దరినీ హాస్పిటల్ లో చేర్పించగా అప్పటికే మనీషా మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన కార్ డ్రైవర్ పరారీలో వున్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుని తీరుతామని కేసును ప్రమాదంగా నమోదుచేసుకున్న పోలీస్ అధికారులు చెపుతున్నారు. ఖొబర్ అనే లఘుచిత్రంతో పాపులర్ అయిన మనీషా, పలు టివి సీరియళ్లు అలానే చిత్రాలలో నటించారు. కాగా ఆమె మరణానికి భోజపురి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది……

  •  
  •  
  •  
  •  

Comments