ఈ ఐపిఎల్ నుండి దూరం కానున్న ప్రముఖ భారత బౌలర్!

Thursday, January 25th, 2018, 01:40:42 PM IST


ఐపీఎల్ వచ్చాక భారత క్రికెట్ ఫార్మాట్ లో ఒక కొత్త శకం మొదలయిందని చెప్పాలి. క్రికెట్ అభిమానులు ప్రతి సంవత్సరం ఈ లీగ్ కోసం ఎదురు చూస్తుంటారు. అయితే ఈ నెలలోనే ఈ సీజన్ తాలూకు ప్లేయర్ల వేలం మొదలవుతున్న తరుణంలో భారత ప్రఖ్యాత బౌలర్ జహీర్ ఖాన్ ఈ ఐపీఎల్ నుండి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అందుకే ఈ సీజన్లో జరిగే ఆక్షన్ నుండి తన పేరు ఉపసంహరించుకున్నట్లు ఈ ఏడాది నుండి ఆయన కామెంటేటర్ అవతారం ఎత్తనున్నట్లు తెలియవస్తోంది. ఆ విధంగా ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ల తో ఒప్పందం కూడా కుదిరినట్లు తెలుస్తోంది. 2017 లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కు ప్రాతినిధ్యం వహించిన జహీర్ ఆ జట్టు తరపున 11 మ్యాచ్ లు ఆది 10 వికెట్ లు తీశారు. ఈ విధంగా చూస్తే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ఒక మంచి బౌలర్ని కోల్పోయినట్లే అని విశ్లేషకులు అంటున్నారు. జహీర్ 2015 లోనే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే…