ప్రముఖ సినీ నిర్మాత కొడుకు దుర్మరణం!

Tuesday, May 8th, 2018, 12:18:15 PM IST

టాలీవుడ్ లో మంచి పేరుగాంచిన నిర్మాతల్లో ఒకరైన భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత దివంగత ఎస్ గోపాల్ రెడ్డి తనయుడు భార్గవ్ నేడు హఠాన్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే సోమవారం తన ఆక్వా హేచరీ దగ్గరకు ఎప్పటిలానే వెళ్లిన భార్గవ్, అక్కడినుండి సముద్ర తీరం వద్దకు ఒంటరిగా వెళ్లి మంగళవారం ఉదయం వరకు తిరిగి రాకపోవడంతో అక్కడి స్థానిక సిబ్బంది వారి కుటుంబ సబ్యులకు సమాచారమిచ్చారు. దీనితో హుటాహుటిన ఆ హేచరీ వద్దకు చేరుకున్న కుటుంబీకులు, సిబ్బంది సముద్రతీరం పరిసర ప్రాంతాలను గాలింపు చేపట్టారు.

కాగా మంగళవారం తెల్లవారుఝామున నెల్లూరు జిల్లా వాకాడ మండలం పంబలి సముద్ర తీరం ఒడ్డున ఆయన శవమై తేలారని తెలుస్తోంది. అసలు ఏమి జరిగింది, ఎందకు ఆయన చనిపోయారు అనే విషయమై పూర్తి వివరాలు తెలియవలసివుంది. నందమూరి బాలకృష్ణతో మంగమ్మ గారి మనవడు, ముద్దల మావయ్య, మువ్వ గోపాలుడు వంటి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఎస్ గోపాల్ రెడ్డి తెలుగువారికి మంచి సుపరిచితులు. కాగా ఆయన కుమారుడి మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు…….

  •  
  •  
  •  
  •  

Comments