అరెస్ట్ అయిన ప్రముఖ టివి నటుడు!

Sunday, July 22nd, 2018, 10:50:55 AM IST

ఓవైపు ప్రభుత్వం, పోలీస్ లు మరియు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎంత చెప్తున్నప్పటికీ కూడా కొందరు రాష్ డ్రైవింగ్ తో అవతలి వారికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ రాష్ డ్రైవింగ్ వల్ల రోజు రోజుకు సంభవించే మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని కొన్ని నివేదికలు కూడా చెపుతున్నాయట. ఇక విషయంలోకి వెళితే, హిందీలో ఫేమస్ అయిన బాలిక వధు, అదేనండి మన తెలుగులో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేమ్ సిద్దార్థ శుక్ల నిన్న ముంబై లో రాష్ గా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి పాల్పడ్డాడు. పోలీస్ లు తెలిపిన వివరాల మేరకు శనివారం వేగంగా నడుపుతున్న తన కారును ఎదురుగా వస్తున్న రెండు కార్లకు ఢీకొట్టాడు సిద్దార్థ. అంతే ఒక్కసారిగా పెను ప్రమాదమే సంభవించింది.

కాగా సిద్దార్థ కారు అదుపుపుతప్పి పక్కనే వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక ఎదురుగా వస్తున్న ఒక కారులోని అద్దాలు పగిలిపోయి రాజ్ కుమార్ అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఘటన అనంతరం స్థలానికి చేరుకున్న పోలీస్ లు సిద్దార్థను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఆయన మద్యం తాగివున్నాడా అనే విషయమై ఆయన్ని బ్లడ్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపినట్లు వారు తెలిపారు. 276,226,337 సెక్షన్ల క్రింద సిద్దార్థపై కేసు నమోదుచేసి అనంతరం ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు….

  •  
  •  
  •  
  •  

Comments