ఓడిపోయారని గుడ్లతో స్వాగతం పలికిన అభిమానులు!

Wednesday, July 11th, 2018, 01:00:46 PM IST

ఫుట్ బాల్ మ్యాచ్ అదే ప్లేయర్స్ కు మ్యాచ్ గెలవాలనే కోరిక ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు గాని అభిమానులకు మాత్రం ఆ డోస్ ఎక్కువగానే ఉంటుంది. ఆడిన ప్రతి మ్యాచ్ కూడా తమ జట్టే గెలవాలని కోరుకుంటారు. ఇకపోతే ప్రస్తుతం రష్యా లో ఫిఫా 2018 వరల్డ్ కప్ ఎండింగ్ కు వచ్చేసింది. ఇటీవల జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్ లో బ్రెజిల్ ఓడిపోవడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. బెల్జియం చేతిలో 1-2 తో ఓడిపోవడంతో ఆటగాళ్లపై పట్టరాని కోపాన్ని చూపించారు.

వారు స్వదేశానికి తిరిగిరాగానే ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లతో గుడ్లతో దాడి చేశారు. గత ప్రపంచ కప్ లో జర్మనీ చేతిలో బ్రెజిల్ 1-7 తో ఓటమిపాలైంది. దీంతో ఈ సారి గెలిచి అభిమానులకు సంతోషాన్ని ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా బ్రెజిల్ క్వార్టర్స్‌ మ్యాచ్ లో కంగుతింది. ఇక అభిమానులు గుడ్ల దాడి చేసి బస్సుకు అడ్డం పడుతుండడంతో పోలీసులు వారిని తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఫైనల్ గా తుపాకీతో గాల్లోకి కాల్పులు జరపడంతో అందరూ వెళ్లిపోయారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments