కత్తి హీరోకి విగ్రహం కట్టిన అభిమానులు

Sunday, October 26th, 2014, 10:54:14 PM IST


తన అభిమాన నటుడు.. విజయదళపతి అని ముద్దుగా పిలుచుకునే నటుడు విజయ్ కు చెన్నైలోని ఓ థియోటర్ లో మైనం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విజయ్ నటించిన కత్తి చిత్రం ఇటివలే విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. విజయ్ నటించిన ఈ చిత్రం అద్బుతవిజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ఈ మైనం విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు అభిమానులు తెలియజేశారు. దీనికోసం 1.5 లక్షల రూపాయలు ఖర్చుచేసినట్టు అభిమానులు తెలిపారు.
అయితే.. ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో.. విడుదల విషయంలో అంతే వివాదాన్ని ఎదుర్కొన్నది. చిత్ర నిర్మాతలలో ఒకరు శ్రీలంకకు చెందిన వ్యక్తీ కావడం ఈ వివాదానికి మూలకారణం అంటున్నారు సినివిశ్లేషకులు.