ఏపీ ముఖ్యమంత్రి జగన్.. రోడ్లపై అభిమానుల ప్లెక్సీలు..!

Wednesday, May 22nd, 2019, 05:28:02 PM IST

ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానుండడంతో అందరిలోనూ గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే వెలువడిన చాలా సర్వేలలో, మరియు మొన్న వెలువడిన ఎగ్జిట్ ఫలితాలలో కూడా వైసీపీకే ఎక్కువ విజయవకాశాలు ఉన్నాయని తేలడంతో వైసీపీ శ్రేణుల్లో సంబరాలు ఆకాశనంటాయి. అంతేకాదు గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నార్రు. ఇంకా ఎన్నికల ఫలితాలే విడుదల కాలేదు, కౌంటింగ్ కూడా మొదలెట్టలేదు అప్పుడే కాబోయే ముఖ్యమంత్రి జగన్ అంటూ, ప్రమాణ స్వీకారానికి ప్లెక్సీలు కూడా కొట్టించుకున్నారు కొందరు వైసీపీ నేతలు.

అయితే తాడేపల్లిలోని వైఎస్ జ‌గ‌న్ నివాసం, వైసీపీ ప్ర‌ధాన కార్యాలయానికి అత్యంత స‌మీపంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతునారన్న హోర్డింగ్‌లు ద‌ర్శ‌న‌మివ్వ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ హోర్డింగ్ పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంకు చెందిన వైసీపీ కో ఆర్డినేట‌ర్ తాడేప‌ల్లిలోని న‌వోద‌య కాల‌నీలోని ఓ భ‌వ‌నంలో అద్దెకు ఉంటున్న ఈ వైసీపీ నేత తాను నివాసం ఉంటున్న భవనంపై జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతునారన్న హోర్డింగ్‌లు పెట్టుకుని జగన్‌పై తనకు ఉన్న విశ్వాసాన్ని చాటుకుంటున్నాడు. ఏది ఏమైనా ఈయన అభిమానం కోసమైనా జగన్ ముఖ్యమ్నంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు వైసీపీ నేతలు.