ముందస్తు ఎన్నికలతో దూరమైన జనసేన…

Monday, November 19th, 2018, 08:12:01 PM IST

తెలంగాణలో జరగబోవు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా లేదా అనే అనుమానం తొలగిపోయింది. నేటికీ నామినేషన్ల గడువు ముగిసిపోవడంతో జనసేన పోటీ చేయట్లేదని తెలిసిపోయింది. ఎందుకు జనసేన పోటీ చేయట్లేదో ఆ పార్టీ అధినేత ఒక ప్రకటనలో వివరించారు. ‘తెలంగాణ రాష్ట్రంలో నిర్దేశిత కాలపరిమితి ఎన్నికలు జరిగినట్లయితే, జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశాలపై ఓ ప్రణాళికను రూపొందించుకున్నాము. కాని ఇక్కడ ముందస్తు ఎన్నికలు రావడం తో కొత్తగా పుట్టుకొచ్చిన జనసేనకి ఎన్నికల్లో పోటీ చేయడం కష్టంగా భావించారు.

కానీ తెలంగాణా ప్రజల వైపు నిలబడటమే తమ పార్టీ లక్ష్యమని పవన్ చెప్పారు. ఈసారి నేతలతో సమావేశం జరిపి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుండే సిద్ధం అవుతందని తెలంగాణ ప్రజలకు తెలియజేశారు. ఎలాగైనా తెలంగాణా ప్రజల్లోకి జనసేన వెళ్తుందని పవన్ ప్రకటించాడు.