తెరాస ప్రచారానికి రైతుల నిరసన సెగ…!

Friday, November 9th, 2018, 11:49:00 AM IST

తెరాస అధినేత అనూహ్య రీతిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, అభ్యర్థుల ప్రకటనలో సైతం అంతే దూకుడు ప్రదర్శిస్తూ రెండు మూడు సీట్లు మినహా అన్ని స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇచ్చారు. అయితే ఇపుడు ఆ దూకుడే తెరాస కొంప ముంచేలా ఉంది. పరచరానికి వెళ్తున్న అభ్యర్థులకు చాలా చోట్ల ప్రజలు నిరసన తెలుపుతూ అడ్డు తగుల్తున్నారు. తాజాగా జనగాం జిల్లా రఘనాథ పల్లెలోని ఖిలాషాపురం లో కూడా ఐడియా పరిస్థితి ఎదురైంది. అక్కడ ప్రచారానికి వెళ్లిన తాటికొండ రాజయ్య వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు.

గోదావరి జలాలతో గ్రామం లోని పటేల్ చెరువు, కొత్త చెరువులను నింపాలని వారు డిమాండ్ చేసారు. గ్రామంలో తాగు, సాగునీటి సమస్య చాల తీవ్రంగా ఉందని ఆవేదన చెందారు. తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటం జనాలు అనారోగ్యాల బారిన పడుతున్నారని చెప్పుకొచ్చారు. అపుడెపుడో 2014 ఎన్నికల సమయంలో వచ్చి హామీలిచ్చి ఓట్లు అడిగి వెళ్లారని, తర్వాత మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని, గోదావరి జలాలతో గ్రామం లోని చెరువులు నింపాకే తిరిగి గ్రామంలో అడుగు పెట్టండి అంటూ రాజయ్య వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. తెరాస అధినేత కెసిఆర్ ముందస్తు వెళ్లిన సమయంలో ఉన్న ఊపు ఇపుడు తెరాస లో కనిపించట్లేదు. ఈ వ్యతిరేకత అధిగమించి తెరాస అధికారాన్ని ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments