వీడియో : వీడు సామాన్యుడు కాదు బాబోయ్.. టాలెంట్ కు అమ్మమ్మ!

Sunday, May 27th, 2018, 12:55:13 AM IST

గిన్నిస్ రికార్డులోకి ఎక్కాలంటే ఈ రోజుల్లో ఓ మనిషి టాలెంట్ ఏ స్థాయిలో ఉండాలో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్క ఉద్యోగానికి లక్షల అప్లికేషన్స్ వచ్చినట్లు కొత్తగా ఏదైనా సాధించాలంటే కూడా మనిషికి పోటీ గట్టిగా ఎదురుపడుతోంది. అయితే ఇటీవల చైనాలోని ఓ కుర్రాడు అందరిని దాటుకుంటూ తన మైండ్ ఎంత స్పీడ్ గా ఉందొ ప్రపంచానికి తెలియజేశాడు. రూబిక్స్ క్యూబ్స్ ని సాధారణంగా సాల్వ్ చేయడం పెద్ద పనేమీ కాదు.

తెలియని వాడికి కూడా గట్టిగా కొన్ని ట్రిక్స్ చెబితే చేయగలడు. కానీ ఒకే సారి మూడు రూబిక్స్ క్యూబ్స్ ని సాల్వ్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు పైగా గాలిలో ఎగరేస్తూ సాల్వ్ చేయడం అంటే అద్బుతమనే చెప్పాలి. అసలు మ్యాటర్ లోకి వస్తే… చైనా కు చెందిన 11 ఏళ్ల క్యూ జియాన్యు 5 నిమిషాల 20 సెకన్లలో రూబిక్స్ క్యూబ్స్ ని సాల్వ్ చేసి గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కాడు. గాల్లో క్యూబ్స్ ఎగరేస్తూ అతను చేసిన ట్రిక్స్ అబ్బుర పరచాయి. మూడింటిని కరెక్ట్ గా చూస్తూ సెట్ చేశాడు. మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. గాల్లో ఒక క్యూబ్ తో మరొక క్యూబ్ ని టచ్ చేస్తూ క్యూ జియాన్యు అందరిని షాక్ కు గురి చేశాడు. అతని మైండ్ ఎంత స్పీడ్ గా పని చేస్తుందో ఈ టాలెంట్ తో బయటపడినదని గిన్నిస్ రికార్డ్ నిర్వాహకులు అతనిని సత్కరించారు. అత్యంత వేగంగా మూడు రూబిక్స్ క్యూబ్స్ ని ఎగరేస్తూ సాల్వ్ చేసిన అతనికి గిన్నిస్ రికార్డ్ దక్కింది.