21 వ శతాబ్దం లోనూ వంతెన లేదు..విశాఖ ఏజెన్సీ వాసుల శివగామి కష్టాలు..!

Wednesday, September 28th, 2016, 01:16:23 PM IST

bhahu
ఈ ఫోటోని చూసి బాహుబలి ని శివగామి కాపాడే మేకింగ్ విజువల్స్ అయిఉంటాయి అనుకుంటున్నారా..? అలా అయితే మీరు పొరపడ్డట్టే. విశాఖ ఏజెన్సీ ప్రాంత వాసుల కష్టాలు ఇవి.ఇంకా ఏడాది కూడా నిండని తీవ్ర జ్వరంతో భాదపడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తరలించడానికి ఓ ఆదివాసీ పడుతున్న శివగామి కష్టాలు.21 వ శతాబ్దంలో వంతెన లేక పీకల్లోతు వరకు ప్రవహిస్తున్న వాగును దాటేందుకు పడుతున్న పాట్లు ఇవి.

వారం రోజులుగా ఏజెన్సీ లో కురుస్తున్న వర్షాలతో కడుముసారి వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. చింతపల్లి మండలం కడుముసారి గ్రామా పంచాయితీకి చెందిన సత్తిబాబు తన ఏడాది కుమార్తె రెండురోజులుగా తీవ్రజ్వరంతో భాదపడుతోంది.ఇంట్లోనే నాటు వైద్యం చేసారు అయినా ఫలితం లేకపోవడంతో అతి కష్టం మీద వాగు దాటించి ఆసుపత్రికి తరలించాడు. దీనితో పాప ఆరోగ్యం కుదుటపడింది.సత్తిబాబు వాగు దాటే చిత్రాలను ఆ ఊరికే చెందిన ఉపాధ్యాయుడు ఫోటోలు తీసి నెట్ లో పోస్ట్ చేసాడు. ఆధునిక యుగం గా చెప్ప్పుకునే 21వ శతాబ్దంలో కూడా ఆదివాసీల కష్టాలు ఇంతేనా ? వంతెన నిర్మించాలన్న ఆలోచన ఈ రాజకీయ నాయకులకు ఇప్పటికైనా కలుగుతుందా…?

  •  
  •  
  •  
  •  

Comments