కొడుకుకు ప్రేమతో 3.60 కోట్ల కారు…!

Monday, January 30th, 2017, 08:23:57 AM IST

car
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడైన జేసీ అస్మిత్ రెడ్డికి 3.60 కోట్ల రూపాయల కారును ఆదివారం బహుమతిగా ఇచ్చారు. ఇటలీలో తయారైన ల్యంబోగిని మోడల్ కు చెందిన ఈ కారును అక్కడినుండి ముంబై వరకు నౌకలోనూ, అక్కడినుండి తాడిపత్రి వరకు కంటైనర్ లోనూ తెచ్చామని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఇలాంటి కారు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదని కూడా ఆయన అంటున్నారు.

రెండు సీట్ల సామర్థ్యం ఉన్న ఈ కారు వేగం గంటకు 320 కిలోమీటర్లని, లీటర్ పెట్రోల్ కు మూడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ కారును నడపాలని తాను ఎప్పటినుండో అనుకుంటున్నట్టు ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు తనకు వయస్సు సహకరించిందని, తన కోరికను కొడుకు ద్వారా తీర్చుకుంటున్నానని ప్రభాకర్ రెడ్డి మురిసిపోయారు. ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి ఆ కారులో తన కుటుంబ సభ్యులను ఎక్కించుకుని తిప్పారు.