కూతుర్నే చంపబోయిన తండ్రి ఇప్పుడు శరణు కోరుతున్నాడు..!

Wednesday, October 3rd, 2018, 04:32:26 PM IST

గత కొద్ది రోజుల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారన్న కారణంతో ప్రణయ్ అనే వ్యక్తి మీద అతని మామయ్య మారుతీరావు అతి దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసినదే.ఐతే ఆ సంఘటన చోటు చేసుకున్న కొద్ధి రోజుల వ్యవధిలోనే మనోహరాచారి అనే వ్యక్తి తన కూతురు చెప్పకుండా కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో రగిలిపోయి నడి రోడ్డు మీద కత్తితో అత్యంత దారుణంగా విచక్షణా రాహిత్యంగా దాడి చేసిన సంగతి కూడా తెలిసినదే.కానీ ఇప్పుడు ఆ తండ్రి శరణు కోరుకుంటున్నడంట.

ఇక వివరాల్లోకి వెళ్లినట్టయితే తన కూతురి మీదనే హత్యా ప్రయత్నం చేయబోయిన మనోహరాచారి అనే వ్యక్తిని హైదరాబాద్ నగర పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసినదే,అయితే అతను అప్పుడు తాగిన మత్తులో ఈ దాడి చేసాడని పోలీసులు తెలుపగా అప్పుడు తాను కావాలనే చేశానని చెప్పుకొచ్చాడు.కానీ మళ్ళీ ఇప్పుడు తాను అప్పుడు తాగిన మైకంలోనే చేశానని,తన కూతురి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు చాలా బాధ పడుతున్నానని,తన కూతురిని ఒకసారి చూడాలని ఉంది అని పోలీసులు దగ్గర వాపోతున్నాడని పోలీసులు తెలుపుతున్నారు.దాడికి గురైన మనోహరాచారి కూతురు మాధవి పరిస్థితి ఇప్పుడు కొంచెం పరవాలేదని వైద్యులు తెలుపుతున్నారు.