వీడియో : చేసిన వెక్కిలి పనికి ప్రాణం పోయేది!

Monday, June 4th, 2018, 06:12:58 PM IST

అమెరికాలో ఎఫ్‌బీఐ అధికారి చేసిన పని ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ గా మారింది. అమెరికా రక్షణ విభాగంలో అధికారులు క్రమశిక్షణతో ఉంటారని ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. కానీ ఓ అధికారి చేసిన వెక్కిలి పని ఇప్పుడు ఫన్నీ ట్రోల్స్ వేసే వరకు వచ్చింది. ఎంజాయ్ చేసేది చేయక అందరూ తనకు ఎట్రాక్ట్ కావాలని స్టంట్స్ ప్రదర్శించాడు. దీంతో ఒక్కసారిగా పొరపాటున జరిగిన ఘటన ఉద్యోగం ఊడగొట్టుకొనే వరకు వచ్చింది.

ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఆఫ్ డ్యూటీలో ఉన్న ఎఫ్‌బీఐ అధికారి గత శుక్రవారం నైట్ డెన్వర్‌లోని మైల్‌ హైల్‌ స్పిరిట్‌ క్లబ్‌ లోకి వెళ్లాడు. అక్కడ అమ్మాయిలను కేరింతలను చూసి వళ్ళు మరచి చించులు వేశాడు. అయితే ఇంతలో అతను ప్యాంట్ వెనకాల దాచుకున్న తుపాకీ కింద పడింది. అది తీసుకుందామని ముట్టుకోగానే పేలింది. బుల్లెట్ గుంపులో ఉన్న ఒక వ్యక్తి కాలికి తగలడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పొరపాటున పైకి తీసినప్పుడు పేలి ఉంటె పరిస్థితి దారుణంగా ఉండేదని అక్కడి వారు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌బీఐ ఈ విషయాన్నీ గోప్యంగా ఉంచుతున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments