విరాళమిస్తాం ఓటెయ్యండి : రాజకీయ నాయకులు..!

Tuesday, September 11th, 2018, 12:04:11 PM IST

తెలంగాణాలో పెరుగుతున్న రాజకీయ వేడికి ఏ పార్టీ నెగ్గుతుందో కొన్ని నెలలు ఆగితే తెలుస్తుంది కానీ ఈ లోపు రాజకీయ నాయకులు మాత్రం వారి వోట్ బ్యాంకును మాత్రం వదులుకునేది లేదు అంటున్నారు. దానికి తోడు రాబోతున్న పండుగలు వారికి మరింత ఉపకారం చేస్తున్నాయి. ఇప్పుడు వీరిని తమ వైపు తిప్పుకుంటే ఆ తరవాత వారి వోట్ బ్యాంకుకు ఎలాంటి ఢోకా ఉండదు అని, ఇదే మంచి సమయం గా భావించిన రాజకీయవేత్తలు ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా చందా కోసం ఎంత అయినా ఇచ్చేస్తున్నారు.

త్వరలోనే వినాయకచవితి పర్వదినం కూడా రాబోతున్నది. దీనితో తెలంగాణా లోని ప్రతి నియోజకవర్గానికి చెందిన నాయకులు అక్కడ వినాయకుని ప్రతిమలను ఏర్పాటు చేసేవారికి కాదనకుండా ఎంత పడితే అంత చందా రాసేస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అయితే అక్కడి నాయకులే వినాయకుని ప్రతిమలు కూడా వారికి తెప్పించేస్తున్నారు. ఎలాగో వారికి ఎన్నికల సమయంలో ఎలాగో ధన ప్రవాహం జరుగుతుంది.. ఇప్పుడు తెలంగాణాలో ఉన్న పరిస్థులును బట్టి చూస్తే వారికి ఈ పండుగల వాతావరణం కూడా బాగా కలిసి వచ్చింది. దీనితో కొన్ని కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఒక్కొక్కరు పదేసి వేల రూపాయలు కూడా దాటి రాసేతున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎలాగో దసరా కూడా రాబోతుంది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణా లోని రాజకీయ నాయకులు వారి ప్రణాళికలు వేసేసుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments