సాగర్ పై ఏపీ జల దౌర్జన్యం… మరో పెద్ద కుట్రకి పన్నాగం..?

Thursday, March 1st, 2018, 11:36:08 AM IST

  • బోర్డు ఆదేశాల నిమిత్తం కుదికాల్వ గేట్లు మూసేసిన తెలంగాణ ప్రభుత్వం…
  • పొలిసు బలగాలను వెంట తెచ్చుకొని మూసిన గేట్లు తెరవాలని ఏపీ సీఈఆదేశాలు.
  • సభ్య కార్యదర్శి సూచనతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీల సంప్రదింపులు.
  • ఏపీపంటపొలాల రక్షణకు అమ్గికరిమ్చ్న తెలంగాణ.. కృష్ణా బోర్డుతో రేపు భేటీకి సిద్దం..

కృష్ణా నదీ బోర్డు ఆదేశాల అమలు అంటు తెలంగాణ ప్రభుత్వానికి హిత బోధలు చేసే ఏపీ ఆ బోర్డుఆదేశాలతో నాగార్జునా సాగర్లో ఆదేశాలకే నీటిని వదలడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన నీటి కోటా పూర్తయిన దరిమిలా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి ఆ రాష్ర్టానికి నీటి విడుదల నిలిపివేయాలని మంగళవారం రోజు కృష్ణాబోర్డు జారీచేసిన ఆదేశాలను బుధవారం తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు అమలుచేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ అధికారులు దౌర్జన్యానికి దిగారు. సాగర్ డ్యాంపై గతంలోలాగానే శాంతిభద్రతల దృష్ట్యా సమస్య తలెత్తే పరిస్థితికి తీసుకువచ్చారు. అయితే, ఉభయ రాష్ర్టాల ఈఎన్సీలు ఈ విషయంపై చర్చించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

  • ఒప్పందానికి మించి ఏపీకి నీటి పారుదాల

నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్ల నుంచి కృష్ణాజలాల వినియోగంపై గతనెల 8న కృష్ణాబోర్డు రెండురాష్ర్టాల అధికారులతో సమావేశం జరిపింది. నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకొని ఏపీ 60 టీఎంసీలు, తెలంగాణ 50 టీఎంసీలు వాడుకునేందుకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుడా కుదిరింది. మంగళవారంనాటికి చేసుకున్న ఒప్పందంకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2.32 టీఎంసీలు ఎక్కువే వాడుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణాబోర్డు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే నీటి విడుదలను ఆపివేయాల్సిందిగా బోర్డు సభ్యకార్యదర్శి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. దీనికనుగుణంగా కుడిపక్క కాల్వ నుంచి రెండువేల క్యూసెక్కుల నీటి విడుదలను బుధవారం ఉదయం నిలిపివేశారు.

  • మంచితనాన్ని ఏపీ అధికారులు ఆసరాగా వాడుకున్నారు…

బోర్డు ఉత్తర్వుల ప్రకారం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలుంటే బోర్డునే సంప్రదించాలి. అంటేకానీ, ఏపీ అధికారులు లెక్కలేనితనం తో ప్రవర్తించారు. బుధవారం ఉదయం తెలంగాణ ఎస్‌ఈ సునీల్, ఏపీ ఈఎన్సీతోపాటు తన కిందిస్థాయి అధికారులకు లేఖలు రాసిన ఏపీ జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్ ఎస్‌ఏ జబ్బార్ కుడి కాల్వనుంచి కోటా పూర్తికాలేదని, గురువారం పూర్తవుతుందని తెలిపారు. పంటలను కాపాడుకునేందుకు రెండువేల క్యూసెక్కుల విడుదల కొనసాగాల్సిందేనని గట్టిగా వాదించారు. అంతటితో ఆగకుండా సిబ్బందితో వెళ్లి కుడికాల్వగేట్లను ఆపరేట్‌చేయాలని, తెలంగాణ అధికారులు అడ్డుపడితే పోలీసులను వినియోగించుకోవాలని కూడా లేఖలో సూచించారు. ఏపీ ఇంజినీర్లు సిబ్బందితో డ్యాం మీదకొచ్చి తెలంగాణ అధికారులపై ఒత్తిడి పెంచడంతో, రెండురాష్ర్టాల పోలీసులు మోహరించడంతో స్వల్ప డ్యాం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

  • పరిస్థితిని చూసి అప్రమత్తమైన తెలంగాణా ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ వైఖరిని గమనించిన సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సునీల్ పరిస్థితిని ఉన్నతాధికారులతోపాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, బోర్డు సభ్య కార్యదర్శి ముందుకి తీసుకువెళ్లారు. పోలీసులతో గేట్లను తెరిచేందుకు ఏపీ అధికారులు ప్రయత్నించేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు అందడంతో నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, బోర్డు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేదాకా కుడికాల్వ ద్వారా నీటి విడుదలను పునరుద్ధరించేదిలేదని తెలంగాణ ఇంజినీర్లు ఏపీ అధికారులకు స్పష్టం చేశారు. కాగా, ఏపీ ఇప్పటికే తన కోటాకు మించి నీటిని వాడుకోవడంతోపాటు ఇలా దౌర్జన్యంగా వ్యవహరించడంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్పీ సీఈ సునీల్ బోర్డు సభ్య కార్యదర్శిని కోరారు.