విశాఖరైల్వే జోన్ పై ఫైట్?

Wednesday, August 8th, 2018, 03:21:42 PM IST

ఏపీ టీడీపీ నేతలు ఇప్పటికే బీజేపీ విభజన హామీలు మరియు ప్రత్యేక హోదా అంశంపై మాట తప్పిందని, ఏపీ ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించిన విషయం తెలిసిందే. అలానే రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజక్టు అయిన పోలవరం ప్రాజక్టు విషయంలో కూడా మోడీ ఇచ్చిన మాట తప్పారని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతేకాక కడపకు ఉక్కు పరిశ్రమ, విశాఖకు రైల్వే జోన్, అలానే పలు రంగాల అభివృద్ధి విషయమై అమలుచేస్తానన్న హామీలను కూడా విస్మరించారనేది వారి ప్రధాన విమర్శ. కాగా నిన్న ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో టిడిపి ఎంపీలు, బీజేపీ నేతలపై చర్చ జరుగుతున్న సమయంలో విమర్శలు లేవనెత్తడంతో అక్కడ కాసేపు వారి మధ్య వాగ్వివాదం జరిగింది.

అంతేకాక బీజీపీ జాతీయ కార్యదర్శి జివిఎల్ నరసింహరావు కూడా ఆ చర్చలో పాల్గొనడంతో ఆ వివాదం మరింత పెరిగింది. టీడీపీ ఎంపీలు జివిఎల్ తో మాటల యుద్ధం మొదలెట్టగా,ఆయన కూడా టీడీపీ ఎంపీలకు గట్టిగా బదులిస్తూ మాట్లాడారు. ఇది ఒకరకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో జరుగుతున్న దాడి అని, టీపీడీ ఎంపీలు చేస్తున్నవన్నీకూడా నిరాధార ఆరోపణలని, అదేంటని నిలదీస్తుంటే మంత్రిగారి ఎదుటనే తనపై దాడికి దిగుతున్నారని అన్నారు. అయితే ఈ అంశంపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ విశాఖకు రైల్వే జోన్ విషయంలో మా ప్రభుత్వం అన్నివిధాలా సానుకూలంగానే ఉందని అతి త్వరలో ఆ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments