ఫిలింఛాంబ‌ర్ కొత్త అధ్య‌క్షుడికి పెనుస‌వాళ్లు

Sunday, July 29th, 2018, 03:08:35 AM IST

టాలీవుడ్‌లో ఇటీవ‌ల గొడ‌వ‌ల గురించి తెలిసిందే. జీఎస్టీ, నోట్ల ర‌ద్దుతో సినీప‌రిశ్ర‌మ కుదేలైపోయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా జీఎస్టీ పేరుతో ప్ర‌తి విభాగంపైనా ప‌న్ను బాదుడు పెద్ద రేంజులో ఉండ‌డంతో సినీప‌రిశ్ర‌మ‌పై అది పెనుభారం మోపింది. దీనికి తోడు డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల దోపిడీ పెద్ద రేంజులో సాగుతుండ‌డంతో ఎవ‌రూ ఏమీ చేయ‌లేని సన్నివేశం నెల‌కొంది. అయితే ఇలాంటి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్కరించే కీల‌క విభాగం అయిన ఫిలింఛాంబర్ నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా ఫిలింఛాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడిగా విశాఖ వాసి, నిర్మాత వి.వీరినాయుడు ని ఏక‌గ్రీవంగా ఎన్నిక చేశారు. 39వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగులో వీరినాయుడిని ఏక‌గ్రీవ ఎన్నిక‌ను ఖ‌రారు చేశారు. ఫిలింఛాంబ‌ర్ ఉపాధ్య‌క్షుడిగా వి.సాగ‌ర్‌ని ఎంపిక‌వ్వ‌గా, పాత క‌మిటీలో కె.బ‌సిరెడ్డి, ఉత్త‌వ‌ర‌పు శ్రీ‌నివాస బాబు ఫిలించాంబ‌ర్ ఉపాధ్య‌క్షులుగా కొన‌సాగుతున్నారు. గౌర‌వ కార్య‌ద‌ర్శులుగా ముత్యాల రామ‌దాసు, కె.శివ‌ప్ర‌సాద‌రావు , గౌర‌వ ఉప‌కార్య‌ద‌ర్శులుగా మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల‌, వి.రామ‌కృష్ణ‌, ఎం.సుధాక‌ర్, జె.మోహ‌న్‌రెడ్డి, పేర్ల సాంబ మూర్తి, ఎన్‌.నాగ‌రాజు, ట్రెజ‌ర‌ర్‌గా టి.రామ‌స‌త్య‌నారాయ‌ణ కొన‌సాగింపు ప్ర‌క్రియ‌కు అంతా ఓటేశారు. నిర్మాత‌ల సెక్టార్ కౌన్సిల్ ఛైర్మ‌న్‌గా వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్‌బాబు, స్టూడియోస్ సెక్టార్ కౌన్సిల్ అధ్య‌క్షునిగా వై.సుప్రియ‌, డిస్ట్రిబ్యూట‌ర్ సెక్టార్ కౌన్సిల్ ఛైర్మ‌న్‌గా వి.నాగేశ్వ‌ర‌రావు, ఎగ్జిబిట‌ర్ సెక్టార్ కౌన్సిల్ ఛైర్మ‌న్‌గా జి.వీర‌నారాయ‌ణ బాబు కొన‌సాగుతున్నారు. నేడు ఛాంబ‌ర్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఈ వివ‌రాల్ని వెల్ల‌డించారు. కొత్త అధ్య‌క్షుడు పెనుస‌వాళ్ల‌ను ప‌రిష్క‌రించాల్సి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

  •  
  •  
  •  
  •  

Comments