‘ప్రగ్యా జైస్వాల్’ విషయంలో ‘ఫిల్మ్ ఫేర్’ కమిటీ పొరపాటు చేసిందా..?

Thursday, June 23rd, 2016, 03:50:45 PM IST

pragya-jaiswal
ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మక ‘ఫిల్మ్ ఫేర్’ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమల్లో ఉత్తమ నటన కనబరిచిన పలువురికి ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమల అవార్డులు ప్రధానోత్సవాలు సజావుగానే ఉన్నప్పటికీ తెలుగు పరిశ్రమలో మాత్రం ఒక తప్పు జరిగినట్టు కనిపిస్తోంది.

తెలుగులో బెస్ట్ డెబ్యూట్ నటిగా ‘కంచె’ సినిమా ఫేమ్ ‘ప్రగ్యా జైస్వాల్’ ఎంపికైంది. మామూలుగా బెస్ట్ డెబ్యూట్ అంటే తొలిచిత్రంతోనే ఉత్తమ నటన కనబరచిన నటీనటులని అర్థం. కానీ ప్రగ్యా జైస్వాల్ కు కంచె తొలి చిత్రం కాదు. దానికంటే ముందే ఆమె జై నాగ్ తీసిన ‘మిర్చిలాంటి కుర్రాడు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జూలై 31, 2015 న విడుదల కాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె అక్టోబర్ 22, 2015 న విడుదలైంది. కాబట్టి ప్రగ్యా జైస్వాల్ కు కంచె డెబ్యూట్ మూవీ అయ్యే అవకాశం లేదు. అలాంటప్పుడు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూట్ నటి అవార్డును ఆమెకు ఇవ్వడం ఎంతవరకూ సమంజసం. అయినా ఈ పొరపాటు వెనుక ఫిల్మ్ ఫేర్ కమిటీ అలసత్వం ఉందో లేకపోతే ఏదైనా రాజకీయం ఉందో వాళ్ళకే తెలియాలి.

  •  
  •  
  •  
  •  

Comments