కంగ‌నా అంటే మేక‌ర్స్.. కంగారు ప‌డుతున్నారంట‌..!

Monday, February 11th, 2019, 04:47:52 PM IST

బాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ న‌ట‌న‌కు ఫిదా అవ్వ‌ని సినీ ప్రేక్ష‌కులు ఉండ‌రు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కంగ‌నా, ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఎంత‌లా అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయాలంటే ద‌ర్శ‌క, నిర్మాత‌ల‌కు గుర్తుకు వ‌చ్చే మొద‌టి పేరు కంగ‌నా. న‌టించే ట‌ప్పుడు ఎంత‌లా ప్రాణం పెడుతుందో. తేడా వ‌స్తే మాత్రం అవ‌త‌లి వారికి వాచిపోయేలా చేస్తుంది. గ‌తంలో హృతిక్‌రోష‌న్, క‌ర‌ణ్ జోహార్, ఇప్పుడు టాలీవుడ్ డైరెక్ట‌ర్ క్రిష్ ఆమెతో పెట్టుకుని ఏమ‌య్యారో అంద‌రికీ తెలిసిందే.

ఇక త‌న‌ని వాడుకోవాల‌ని చూసినా, ఆమెను బ్లేమ్ చేయాల‌ని చూసినా వారి అంతుచూడ‌కుండా నిద్ర‌పోవ‌డంలేదు కంగనా. త‌న‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దిపితే.. చిన్న చిన్న విషయాల్ని కూడా పెద్దదిగా చేసి రచ్చ చేసి బ‌జారుకీడుస్తుంది కంగ‌నా. ఇప్ప‌టికే ఆమెతో పెట్టుకున్నవారికి ఎలాంటి గ‌తి ప‌ట్టిందో అంద‌రికీ తెలుసు. దీంతో ఆమెకు టాలెంట్ ఉన్నా, కంగ‌నాతో సినిమాలు చేయ‌డానికి మేక‌ర్స్ వెనక‌డుగు వేస్తున్నారు. కంగ‌నాతో సినిమా చేస్తే ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయో అని ద‌ర్శ‌క, నిర్మాత‌లు ఆలోచిస్తున్నార‌ని తెలుస్తుంది. దీంతో ఫ్యూచ‌ర్‌లో కంగ‌నాకు వ‌చ్చే అవ‌కాశాల‌కు కూడా బ్రేక్ ప‌డే చాన్స్ ఉంది. మ‌రి కంగ‌నా త‌న తీరు మార్చుకుంటుందో లేక అలాగే ముందుకు సాగుతుందో చూడాలి