టీ20 గా మారిన ఫైనల్ వన్డే మ్యాచ్.!

Sunday, June 23rd, 2013, 07:45:17 PM IST

చాంపియన్స్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో అమీ తుమీ తేల్చుకోవడానికి ఇండియా – ఇంగ్లాడ్ జట్లు సిద్దమయ్యాయి. అనుకున్న టైంకి టాస్ కోసం గ్రౌండ్ లోకి వచ్చిన ఇద్దరు కెప్టెన్ లలో ఇంగ్లాండ్ కెప్టెన్ కుక్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ కి చుక్కలు చూపించడానికి ఇండియా, తమ బౌలింగ్ తో ఇండియాని కట్టడి చేయడానికి సిద్దమవుతున్న ఇంగ్లాండ్, అలాంటి సమయంలో ఇరుజట్ల ఆవేశాన్ని వరుణుడు వర్షం రూపంలో వచ్చి ఆవిరి చేసాడు. అలా వరుణుడు విడతలు విడతలుగా కురుస్తుండడంతో ప్లేయర్స్ చేసేదేమీ లేక పెవిలియన్ లోనే ఉండిపోయారు. భోజన సమయానికి కూడా వర్షం తగ్గక పోవడంతో చాంపియన్స్ ట్రోపీ యాజమాన్యం లంచ్ బ్రేక్ తర్వాత వర్షం తగ్గితే వన్డే మ్యాచ్ ని కుదించి ట్వంటీ 20 గా నిర్వహిద్దామని సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు వారి ఆశలను అడిఆశలు చేయడానికి మేఘాలు మబ్బులతో కూడుకొని చిరుజల్లులు కురుస్తున్నాయి. మరో వైపు మ్యాచ్ తిలకించడానికి వచ్చిన అభిమానులు గొడుగులేసుకొని మైదానంలో పడిగాపులుకాస్తున్నారు.