పార్లమెంట్ లో బిట్ కాయిన్..నిర్మొహమాటంగా చెప్పేసిన అరుణ్ జైట్లీ..!

Tuesday, January 2nd, 2018, 09:31:46 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎట్టకేలకు బిట్ కాయిన్ గురించి స్పందించారు. బిట్ కాయిన్ విషయంలో కేంద్రం వైఖరి ఏంటని డీఎంకే ఎంపీ కనిమొళి రాజ్యసభలో ప్రశ్నించగా అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. ఇండియాలో ఊహాజనిత కరెన్సీ(బిట్ కాయిన్) చట్టబద్దం కాదని అరుణ్ జైట్లీ నిర్మొహమాటంగా ప్రకటించారు. బిట్ కాయిన్ ద్వారా లావాదేవీలు జరిపే వారిపై చర్యలు తీసుకునేందుకు ఆర్థిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు జైట్లీ వివరించారు. బిట్ కాయిన్ రూపంలో పెట్టుబడులు పెట్టె వారికి ప్రభుత్వం భాద్యత కాదని అన్నారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఊహా జనిత కరెన్సీ ద్వారా 11 శాతం మంది లావాదేవీలు జరుపుతున్నారని అన్నారు. భారత్ లో ఇటువంటి చలామణి చట్టబద్దం కాదని అన్నారు. అధికలాభం వస్తోందని వదంతులని నమ్మి సొమ్మియు వృధా చేసుకోవద్దని సూచించారు. కమిటీ నివేదిక వచ్చాక బిట్ కాయిన్ పై పూర్తి స్థాయిలో స్పందిస్తాం అని అరుణ్ జైట్లీ అన్నారు.