బిల్డప్ బాబాయ్” 20 మిలియన్ అందుకున్నాడంటే నమ్మరేంట్రా బాబు.!

Saturday, June 1st, 2019, 12:50:50 PM IST

మీకు ప్రపంచంలో తెలీని విషయం ఏదైనా సరే ఒక వ్యక్తికి తెలుసు,ఎంత పెద్ద స్టార్ అయినా సరే అతనికి చాలా క్లోజు..అతని వల్ల కానిదంటూ ఏం లేదు,ఇప్పుడైతే అతని పేరు తెలీని తెలుగు వారు ఉండరు.అతనే “బిల్డప్ బాబాయ్”.నిరంతరం వినోదాన్ని పంచే ఈటీవీ లో ప్రసారమయ్యే ”జబర్దస్త్” మరియు ”ఎక్స్ట్రా జబర్దస్త్” షోలు అందించే ఎంటెర్టైనేమేంటే వేరు..

ఈ ఎంటర్టైన్మెంట్ లో భాగంగా గత ఏడాది సెప్టెంబర్ 14న ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ షోలో ఈ బిల్డప్ బాబాయ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.సుడిగాలి సుధీర్ టీమ్ అయినటువంటి రామ్ ప్రసాద్ గెటప్ శ్రీను మరియు సన్నీలు చేసిన బిల్డప్ బాబాయ్ స్కిట్ లో వీరు పండించిన కామెడీ అయితే మాములుగా ఉండదు.

ఇలాంటి అద్భుతమైన కాన్సెప్టును తీసుకున్న ఈ స్కిట్ మాత్రం ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదనే చెప్పాలి.ఎప్పుడో 20 మిలియన్ మార్కును అందుకుంటుందనుకున్న ఈ స్కిట్ ఈ రోజున ఆ ఫీట్ ను అందుకుంది.కేవలం 20 మిలియన్ మార్కును ఆదుకోవడం మాత్రమే కాకుండా లక్షా 20 వేల లైక్స్ ను సొంతం చేసుకున్న స్కిట్ గా జబర్దస్త్ లో మరో రికార్డు కూడా ఉంది.మొత్తానికి బిల్డప్ బాబాయ్ తో పెట్టుకుంటే మావూలుగా ఉండదని నిరూపించేసుకున్నాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి