ఎట్టకేలకు శ్రీకాకుళంలో అడుగుపెట్టి తెలుగు తమ్ముళ్ల నోరు మూయించిన పవన్!

Wednesday, October 17th, 2018, 05:14:30 PM IST

గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ఆ పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకాకుళంలోని తిత్లి తుఫాను బాధితులను పరామర్శించిన సంగతి తెలిసినదే. అయితే ఈ ప్రాంత ప్రజలని ప్రమర్శించడానికి మాత్రం పవన్ మాత్రం ఎందుకు రాకుండా ఉండిపోయారని తీవ్ర విమర్శలు చేశారు.పవన్ కి ఇక్కడ ప్రజల సమస్యల కన్నా గోదావరి జిల్లాల్లో కవాతు ఎక్కువయ్యిపోయిందా అని కూడా విమర్శించారు.

అయితే ఈ విషయం పై పవన్ తన కవాతుకు ముందే తాను ఎందుకు అక్కడకి హాజరు కాలేదో కూడా వివరణ ఇచ్చారు.మరి ఆ విషయం వారికి తెలిసి విమర్శించారో లేక కావలెనే విమర్శించారో వారికే తెలియాలి.అయితే ఈ రోజు మాత్రం పవన్ ఎట్టకేలకు శ్రీకాకుళంలో అడుగు అడుగు పెట్టి అక్కడ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని మరీ రాసుకున్నారు.ఈ రోజు నుంచి మొత్తం మూడు రోజులు శ్రీకాకుళం జిల్లా అంతటా పర్యటిస్తానని తెలిపారు.పవన్ రావట్లేదు రావట్లేదు అని అంటున్న తెలుగు తమ్ముళ్లకు ఈ రోజు పవన్ చెంప పెట్టుగా సమాధానం ఇచ్చారు.