కాటమరాయుడు…షూటింగ్ కి రెడీ అయ్యాడు ?

Saturday, September 17th, 2016, 10:24:22 AM IST

katama-rayudu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ”కాటమరాయుడు”. డాలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇదివరకే ఓ షెడ్యూల్ ని పూర్తీ చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ జనసేన కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. ఇటీవలే ఆంధ్రా కు ప్రత్యేక హోదా విషయంలో పోరాటం చేయాలనీ భావించాడు కానీ ఈ లోగా కేంద్రం ప్రత్యేక రాయితీని ప్రకటించడంతో … పవన్ మళ్ళీ సినిమా షూటింగ్ లో బిజీ అవ్వాలనే ప్లన్స్ జరుగుతున్నాయి. ”కాటమరాయుడు” నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 20 నుండి మొదలు కానుంది. ఇప్పటికే అన్నిరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్ లో పవన్ నాలుగు రోజులు ఆలస్యంగా పాల్గొంటాడని తెలిసింది, దానికి కారణం అయన ఫిట్నెస్ కోసం ఈ రోజు బెంగుళూరు వెళుతున్నాడట. అక్కడ వారం ఉండి .. ఆ తరువాత 24 నుండి షూటింగ్ లో పాల్గొంటున్నట్టు పవన్ వర్గాల ద్వారా తెలిసింది! కంటిన్యూ గా షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్ !! ఈ చిత్రంలో గ్లామర్ భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ త్వరలోనే ఫినిష్ చేసి .. జనవరిలో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు ?