పంతం నెగ్గించుకుంటున్న ట్రంప్?

Wednesday, February 28th, 2018, 01:35:30 AM IST

మన దేశంలో కొంత మేర చదువు వుండి, కొంత ఆర్ధిక స్థోమత ఉంటే చాలు, అటువంటి వారు ఉన్నత చదువులు, ఉద్యోగాల కై అమెరికా బాట పట్టడం మనకు తెలిసిందే. అయితే క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ పై అనూహ్య విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ రాక తర్వాత ఒక్క అమెరికన్లకు మాత్రమే అక్కడ ప్రధమ స్థానం దక్కుతోంది. అమెరికా సరుకులనే కొనండి, అమెరికన్ లనే పనిలో పెట్టుకోండి అంటూ ప్రచారం చేసిన అమెరికా అధ్యక్షుడు అమెరికన్ సంపద ఉద్యోగాలు, ఇలా అన్ని రకాల విషయాల్లో అక్కడి పౌరులదే ప్రధమ హక్కు అని, వారికి ఉద్యోగ, నివాస భద్రత కల్పించడమే తన నినాదమని ఆయన ముందుకు సాగరు.

ఆనినాదమే ఆయన్ని గెలిపించింది అని కొందరు అంటుంటారు కూడా. ఆయన గద్దె నెక్కినప్పటినుండి అన్ని విధాలా ఇతర దేశస్థుల రాకకు అడ్డుకట్ట వేస్తూనే వున్నారు. డొనాల్డ్ ట్రంప్ స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు హెచ్1బీ వీసాలకు కళ్లెం వేసిన విషయం తెలిసిందే. భారత్ తో సహా ఇతరదేశాల నుంచి వచ్చే ఐటీ ఉద్యోగులకు అత్యంత ప్రీతిపాత్రమైన తాత్కాలిక వీసా నిబంధనలను కఠినతరం చేశారు. అమెరికన్ల ఉద్యోగాలు, వేతనాలు కాపాడాలన్న లక్ష్యంతో విదేశీయులను దేశంలోనికి అనుమతించే విషయంలో రూపొందించిన అన్ని చట్టాలను కఠినంగా అమలు చేయాలని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది. వీసా కోసం ప్రయత్నాలు చేసి చివరికి అమెరికా వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసేవారే ఎక్కువ మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అయితే భారత్ నుంచి అమెరికా వెళ్లే వారిలో ఎక్కువ శాతం విద్యార్ధులు ఉద్యోగులే ఉంటారు. ముఖ్యంగా విద్యార్ధులు భారత్ నుంచి వచ్చి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు చేసేందుకు మొగ్గుచూపుతుంటారు. ఆ విధంగా చూస్తే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని, కాగా గత 2016-17 సంవత్సరం లో అమెరికా కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 20 శాతం మేర తగ్గిందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ(ఎన్ ఎఫ్ ఏపీ) తేల్చి చెప్పింది. కానీ ప్రస్తుత తరుణంలో అమెరికా విధిస్తున్న వీసా ఆంక్షలు, చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని ఎన్ ఎఫ్ ఏపీ పేర్కొంది. దీంతో మనవాళ్లు విదేశీ మోజును వదిలేసి స్వదేశంలో తమ ప్రతిభకు సానబెడుతున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments