చివరికి దిగివచ్చి క్షమాపణలు చెప్పిన విజయ్ సాయి రెడ్డి!

Wednesday, July 25th, 2018, 02:59:53 PM IST

గత కొద్దిరోజులుగా అటు లోక్ సభ మరియు ఇటు రాజ్య సభలలో ఏపీకి విభజన హామీలు నెరవేర్చడం, ప్రత్యేక హోదాపై ఢిల్లీ వేడెక్కిపోతోంది. కాగా నిన్న రాజ్యసభలో విభజన హక్కుల విషయమై వాడివేడిగా చేర్చ జరిగింది. అయితే ఈ చర్చలో భాగంగా నిన్న సభ ముగుస్తున్న సమయంలో తన ప్రసంగాన్ని మొదలెట్టిన విజయసాయిరెడ్డి ఆ విషయమై మాట్లాడుతూ వున్నారు. కాసేపటికి చైర్మన్ వెంకయ్య నాయుడు సభా సమయం అయిపొయింది ఇంక మీ వ్యాఖ్యానం ఆపండి అని చెప్పడంతో ఆయన్ను అడ్డగించిన విజయ్ సాయి, కాసేపు ఆగ్రహించి, చైర్మన్ కేవలం అధికార పక్షంవారికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంతే కాదు వెల్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా ఈ ఘటన విషయమై నేడు సభ ప్రారంభమైన తరువాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడిన విజయ్ గోయల్ నిన్న సభలో జరిగిన విజయ్ సాయి ఘటనలో ఆయన చైర్మన్ కు క్షమాపణ చెప్పవలసిందిగా కోరారు.

అంతేకాదు కాంగ్రెస్ నేత ఆజాద్ కూడా విజయ్ సాయి తీరును తప్పుపట్టారు. తదనంతరం వెంకయ్యకు ఇతర పార్టీల నాయకులూ కూడా మద్దతు పలకడంతో చివరికి మాట్లాడడం మొదలెట్టిన విజయ్ సాయిరెడ్డి నిన్న ఎందుకు తాను అలా ప్రవర్తించవలసి వచ్చిందని చెప్పడానికి ప్రయత్నించగా చైర్మన్ వెంకయ్యనాయుడు అడ్డగించి, నిన్నటి ఘటన విషయమై తనకు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదని, అలానే తనకు క్షమాపణ కూడా అవసరం లేదని సున్నితంగా చెప్పుకొచ్చారు. అయితే సభలో తనకు ఇచ్చిన సమయం కనుక సరిపోకపోతే మెల్లగా అడిగి పొడిగించేలా అభ్యర్ధించాలేతప్ప అలా ఆగ్రహించి సభ మర్యాదకు భంగం కలిగేలా వ్యవహరించకూడదని అన్నారు. ఇక ఆ తరువాత చైర్మన్ కు విధిగా నిన్న సభ సాక్షిగా జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నట్లు విజయ్ సాయి ప్రకరించారు. తదనంతరం సభ్యులు ఆయన పై హర్షద్వానాలు వ్యక్తం చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments