ఎమ్యెల్యే ఆఫీస్ లో అగ్నిప్రమాదం!

Wednesday, January 24th, 2018, 08:31:54 AM IST


గన్నవరం లోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా వున్న ఎమ్యెల్యే వల్లభనేని వంశి ఆఫీస్ లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యధావిధిగా నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కార్యాలయానికి తాళాలు వేసిన సిబ్బందికి ఎక్కడో వైర్లు కాలుతున్న వాసన రావడంతో, తక్షణం అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. అప్పటికే ఆఫీసులో లోని ఒక గదిలోకి మంటలు బాగా వ్యాపించడంతో, సిబ్బంది పార్టీ శ్రేణులు అంతాకలిసి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రెండు ఏసి లు, సోఫా సెట్లు, కంప్యూటర్లు, రెండు టివి లు, లాప్ టాప్ ల తో పాటు సియం సహాయనిధి నుండి లబ్ధిదారులకు అందించే చెక్కులు కూడా అగ్నికి ఆహుతి అయినట్లు చెప్తున్నారు. సిఐ శ్రీధరకుమార్ ఆధ్వర్యం లో ఎస్ఐ లు, మరియు సిబ్బంది కలిసి భద్రత చర్యలు చేపట్టారు. పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. వంశి ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్యెల్యే దేవినేని ఉమా మహేశ్వర రావు, బచ్చుల అర్జునుడు ప్రమాదం జరిగిన గదిని పరిశీలించారు. మొత్తంగా చూస్తే దాదాపు రు.10 లక్షల విలువయిన వస్తువులు దగ్ధమైనట్లు తెలియవస్తోంది.