హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం!

Monday, July 23rd, 2018, 10:40:52 AM IST

ప్రస్తుతం కొన్నాళ్లుగా హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు, బ్లాస్టింగ్ తదితర సంఘటనలు నగరాన్ని కుదిపేస్తున్నాయి. ఇటువంటి ఘటనలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఒక నిర్మాణంలో వున్న భవనంలో అనుకోకుండా పేలుళ్లు సంభవించిన ఘటనలో ముగ్గురు మృత్యు వాత పడ్డారు. అలానే అటువంటిదే మరొక ఘటనలో మరొక ఇద్దరు మరణించారు. ఇక ప్రస్తుతం నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలోని సుభాష్ నగర్ లో ఒక అట్టలు తాయారు చేసే ఫ్యాక్టరీలో అనుకోకుండా మంటలు చెలరేగి ఆ ఫ్యాక్టరీ మొత్తం దగ్ధం అయింది. కాగా ఆ మంటలు పక్కనే వున్న ఫ్యాన్ల ఫ్యాక్టరీ కి కూడా వ్యాపించడంతో ఒక్కసారిగా మంటలు మరింతగా చెలరేగాయి. అది అర్ధ రాత్రి సమయం కావడంతో స్థానికులు అలానే ఫ్యాన్ల ఫ్యాక్టరీ పక్కల వున్న భవనాల వారు భయంతో బయటకి పరుగులు తీశారు.

ఇక స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత పోలీస్ లు కూడా వచ్చారు. అయితే జరిగిన ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదని, అసలు మంటలు ఎలా వ్యాపించాయి తెలుసుకోవలసి ఉందని వారు చెపుతున్నారు. కాగా జరిగిన ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. అయినా జనావాసాల మధ్యన పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఏంటని, ఇటువంటి ఘటనల వల్ల తమకు భయం మరింత పెరుగుతోందని, ప్రభుత్వం ఇకనైనా చెర్యలు తీసుకుని వీటిని పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments